*తిరుపతి విమానాశ్రయంలో అతిపెద్ద రన్వే*
ఏపీలో తిరుపతి విమానాశ్రయంలో అంతర్జాతీయ విమానాలు ల్యాండ్ అయ్యేందుకు వీలుగా రాష్ట్రంలోనే అతిపెద్ద రన్వే అందుబాటులోకి వచ్చింది.ప్రస్తుతం ఈ విమానాశ్రయం లో అందుబాటులో ఉన్న 2,285 మీటర్ల రన్వేను రూ.156.16 కోట్లు వెచ్చించి 3,810 మీటర్లకు విస్తరించారు. ఎయిర్పోర్టు డైరెక్టర్ మానే శ్రీనివాస్ మాట్లాడుతూ.. తిరుపతి విమానాశ్రయంలో రన్ వేను విస్తరించడంతో విశాఖపట్నం, విజయవాడ విమానాశ్రయాల కన్నా పెద్ద రన్వే ఏర్పడిందన్నారు.