డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను పరిష్కరించుకోండి:గద్వాల ట్రాఫిక్ ఎస్సై బాలచంద్రుడు..
లోక్ అదాలత్ లో ఆఖరు అవకాశం వారం రోజులే
-డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన బాధితులు జిల్లా కోర్టు సముదాయం లో నిర్వహిస్తున్న లోక్ అదాలత్ ఇంకా వారం రోజులు తమ కేసులు పరిష్కరించుకోవడానికి అవసరకాశం ఉన్నట్లు గద్వాల ట్రాఫిక్ ఎస్సై బాలచంద్రుడు
అన్నారు.సోమవారం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కార్యాలయంలో ఆయన ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్సై బాలచంద్రుడు మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ లో కేసులో పట్టుబడ్డ వాహనదారులు లోక్ అదాలత్ లో తక్కువ జరిమానా తో మీ యొక్క కేసులను పరిష్కరించుకోగలరని అన్నారు.నేరస్తులకు జైలుకు వెళ్లకుండా కేసులు పరిష్కరించుకోవచ్చు అని ఆయన తెలియజేసారు.ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో మీ వివరాలు తెలియచేసి,కోర్టు విధించిన జరిమానా ను చెల్లించాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ట్రాఫిక్ ఎస్సై బాలచంద్రుడు సూచించారు.