*చట్టం అంటే లెక్క లేదా?: హైకోర్టు*
*పోలీసులపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం*
*అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది?..*
*సిట్ అధికారులు చాలా పెద్దవాళ్లం* ..
*శక్తిమంతులం అని భావిస్తున్నారు* ..
*మీకు చట్టం అంటే గౌరవం లేదని అర్థమవుతోంది*
పోలీసులే చట్టాన్ని ఎలా ఉల్లంఘిస్తారు?.. మీరున్నది చట్టాన్ని కాపాడటానికి తమకు చట్టం అవసరం లేదు..
అధికారమే ముఖ్యమనుకుంటున్నారు
ఒంటిపై యూనిఫామ్ ఉందని ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనుకుంటున్నారు
*మిమ్మల్ని వెనక నుంచి నడిపిస్తున్న వారిని రమ్మనండి* .. *చట్టం గురించి వారితోనే మాట్లాడతాం*
*పోలీసుల వైఖరి అత్యంత బాధాకరం* .. *ఇలాగే వదిలేస్తే రేపు అందరం బాధపడాలి*
*వ్యక్తి స్వేచ్ఛ కన్నా కోర్టులకు ఏదీ ముఖ్యం కాదు*
అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? చట్టాన్ని బేఖాతర్ చేస్తున్న పోలీసులను ఇలాగే వదిలేస్తే రేపు మనం అందరం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వ్యక్తి స్వేచ్ఛకు మించి మాకు ఏదీ ముఖ్యం కాదు. ఈ విషయాన్ని పలుమార్లు పునరుద్ఘాటించినా పోలీసులు కోర్టుల ఆదేశాలను లెక్కచేయడం లేదు. పోలీసులై ఉండి చట్టాన్ని ఎలా ఉల్లంఘిస్తారు? మీరుండేది చట్టాన్ని, న్యాయాన్ని కాపాడటానికా? లేక దాన్ని ఉల్లంఘించడానికా? పిల్లలు తప్పు చేశారంటూ తల్లిదండ్రులను వేధిస్తారా? తెలియని విషయాలను చెప్పాలని ఒత్తిడి చేస్తారా? ఇలా చేయమని ఏ చట్టం మీకు చెబుతోంది? పౌరుల పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇదేనా?
– *హైకోర్టు*