విద్యార్థుల సమస్యల్ని ఆకళింపు చేసుకున్న వర్సిటీల నేత..

హైదరాబాద్ లోని వివిధ కాలేజీ విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను “అల్ యూనివర్సిటీ” స్టేట్ సెక్రటరీ కామ్రేడ్ టి.మహేందర్ విద్యార్థుల నుంచి ఆకళింపు చేసుకున్నారు. బుధవారం ఉదయం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద జరిగిన సమావేశంలో హాస్టల్ సౌకర్యాలు, అధిక ఫీజులు, అమ్మాయిల సురక్షిత తదితర అంశాలపై సుధీర్ఘంగా చర్చ జరిపారు. విద్యార్థుల ప్రశ్నలకు మహేందర్ మంచిగా జవాబులిస్తు ఉద్యమ మార్గం పట్టాల్సిన అవశక్యతను తెలియజేశారు. అనంతరం విద్యార్థుల ఐక్యత వర్ధిల్లాలి! శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాడుదాం పోరాడుదాం! విద్యను కార్పటైజేషన్ బ్రాహ్మణీకరణ నుంచి రాక్షిదాం రక్షిదాం అంటూ యువకులు నినాదాలు చేశారు. ఈ సమావేశంలో విద్యార్టులైన పల్గిరి అరవింద్, మల్లూరి సంజయ్, చిటుమల వంశి, కూన అరవింద్, హృతిక్, పెయింటింగ్ లేబర్ నాయకులు తప్పేట్ల ఎలియ మహారాజ్, గూడెం భిక్షపతి మహారాజ్, జర్నలిస్టులైన అంగుళి మాలజీ తదితర్లు పాల్గొన్నారు..
Post Views: 10