*చేనేత కార్మికులపై కాంగ్రెస్ కు కనికరం లేదు… ఉపాధి చూపెట్టకుండా గోసపెడుతుంది*
*గర్షకుర్తి పవర్ లూమ్స్ కార్మికుల సమస్య పరిష్కారమయ్యే వరకు బిజెపి అండగా ఉంటుంది*
*బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి*
*కరీంనగర్ ప్రశ్న ఆయుధం న్యూస్ బ్యూరో జులై 31*
పవర్ లూమ్స్ నేత కార్మికుల కు పని కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని నేతన్నలకు ఉపాధి లేక ఆకలిటితో అలమటిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చేస్తుందని గ ర్షకుర్తి పవర్ లూమ్స్ కార్మికులు ఉపాధి కోసం ఆందోళన లు చేస్తున్న వారి సమస్యలు ప్రభుత్వం తమకు పట్టదు అన్నట్లుగా వ్యవహరిస్తుందని నేతన్నలపై కాంగ్రెస్ కు కనికరం లేదని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు ఉపాధి కోసం గత కొన్ని రోజులుగా గంగాధర మండలం గర్షకుర్తి గ్రామ పవర్ లూమ్స్ కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష కు బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణా రెడ్డి స్థానిక బిజెపి శ్రేణులు బుధవారం రోజున కార్మికుల కు సంఘీభావం తెలియజేస్తూ మద్దతు తెలియజేశారు బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగడి కృష్ణా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెల్లల కాలం గడిచిన నేత కార్మికులకు ఉపాధి అవకాశాలుచూపెట్టలేకపోతునందుకు సిగ్గుపడలన్నారు ముఖ్యంగా గర్షకుర్తి పవర్ లూమ్ వస్త్ర పరిశ్రమలను నమ్ముకొని ఎంతో మంది నేత కార్మికుల కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు గతంలో బతుకమ్మ చిరెలతో వస్త్ర పరిశ్రమ లకు ఆర్డర్ లు ఉండేవని ప్రస్తుతం అలాంటి ఎ ఒక్క ఆర్డర్ లేకపోవడం తో ఉపాధి లేక కార్మికులు అల్లాడిపోతున్నారని వస్త్ర పరిశ్రమకు కార్మికుల భవిష్యత్తు కోసం కాంగ్రెసు నేటి కి ఏ లాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. గత ఐదు రోజులుగా నేత కార్మికులు ఇక్కడి ప్రాంతంలో ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంపై ఆయన మండిపడ్డారు. నేతన్నల బతుకులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన లేదా అని ఆయన ప్రశ్నించారు నేతన్నలకు ఉపాధి చూపెట్టకపోతే జీవితాలు గడవలేని పరిస్థితి ఉందని ఉపాధి లేక ఆకలితో అలమటించి ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు గతంలో ఇక్కడ జరిగాయని మళ్లీ అలాంటి పరిస్థితి ఇక్కడ పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గర్షకుర్తి వస్త్ర పరిశ్రమకు ఆర్డర్స్ ఇవ్వాలని నేత కార్మికులకు ఉపాధి చూపెట్టాలని ఇక్కడి ప్రాంతంలో నేత కార్మికులకు భరోసా కల్పించి ఆదుకోవడానికి తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు గర్షకుర్తి పవర్లూమ్ కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు బిజెపి అండగా ఉంటుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పద్మశాలి అధ్యక్షుడు కొత్తపెల్లి వాసాల రమేష్ చొప్పదండి అసెంబ్లీ కన్వీనర్ పెరుక శ్రావణ్ కుమార్ మండల ఆధ్యక్షులు కోల అశోక్ జిల్లా జనరల్ సెక్రెటరీ వెంకట్ రమణారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యుల శ్రీపతి చంద్రశేఖర్ మాజీ సర్పంచి కమటం రాయ మల్లు
చేనేత సెల్ జిల్లా కో కన్వీనర్ శ్రీపతి రాజేంద్రప్రసాద్ సోషల్ మీడియా జిల్లా కో కన్వీనర్ ఆకుల మనోహర్ పటేల్ మండల ఉపాధ్యక్షులు వోడ్నాల రాజు మండల కార్యదర్శి దాసరి ఆంజనేయులు తాళ్ల రాజశేఖర్ దళిత మోర్చా మండల అధ్యక్షులు బిజెపి సీనియర్ నాయకులు చిందం ఆంజనేయులు సదాల భాస్కర్ దాసరి రాజు బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
తెలంగాణ ప్రజల పరిస్థితి పెనంపై నుండి పొయ్యిలో పడ్డట్టయ్యింది