Site icon PRASHNA AYUDHAM

విప్లవ సింహం యువ కిషోర్ షహీద్ భగత్ సింగ్ జీవితం నేటి యువతకు ఆదర్శంగా కామ్రేడ్ మైదం శెట్టి రమేష్

IMG 20250323 WA0171

విప్లవ సింహం యువ కిషోర్ షహీద్ భగత్ సింగ్ జీవితం నేటి యువతకు ఆదర్శంగా

కామ్రేడ్ మైదం శెట్టి రమేష్

ప్రశ్న ఆయుధం మార్చి 23: శేరిలింగంపల్లి ప్రతినిధి

గ్రేటర్ హైదరాబాద్ మియాపూర్ డివిజన్ లో ముజఫర్ అహమ్మద్ నగర్ లో ఎం సి పి ఐ (యు), ప్రజా సంఘం ఆధ్వర్యంలో ఏ ఐ ఎఫ్ డి వై గ్రేటర్ హైదరాబాద్

కన్వీనర్ డి మధు సూదన్ అధ్యక్షతన జరిగింది. పార్టీ మియాపూర్ డివిజన్ కార్యదర్శి ఇస్లావత్ దశరథ్ నాయక్ షహీద్ భగత్ సింగ్ చిత్రపటానికి, ప్రజా సంఘ నాయకులతో కలిసి పూలమాలలు వేసి, 94వ వర్ధంతిని సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఎం సిపిఐ(యు) పార్టీ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి కామ్రేడ్ మైదం శెట్టి రమేష్ మాట్లాడుతూ మాట్లాడుతూ భరతమాత దాస్య శృంఖలాలను బద్దలు కొట్టడానికి,బ్రిటిష్ వాళ్ళను ఈ దేశం నుండి తరిమి కొట్టడానికి,నూనూగు మీసాల చిన్న వయసులోనే రాజ్ గురు, సుఖ్ దేవ్ లతో కలిసి బ్రిటిష్ పార్లమెంటు పైన బాంబుల వర్షం కురిపించి చిరునవ్వులు చిందిస్తూ ఉరికొయ్యలను ముద్దాడుతూ ఇంక్విలాబ్ నినాదాన్ని దేశ యువతకు ప్రజలకు అందించి యువతను విప్లవ బాటలో పయనించాలని, బానిసత్వాన్ని ఎదిరించాలని,బ్రిటిష్ వాళ్ళను ఈ దేశం నుండి పారద్రోలే వరకు విశ్రమించొద్దని నినదించిన,ప్రబోధించిన వీర యువ కిశోరం,విప్లవ సింహం,యువతరానికి స్ఫూర్తి ప్రదాత షహీద్ భగత్ సింగ్ అని,ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయిన ఆయన మరణం ఈ దేశంలో విప్లవానికి శంఖారావాన్ని పూరించిందని, యువతరాన్ని మేల్కోలిపిందని, చైతన్యాన్ని రగిలించిందని,అన్ని వర్గాల ప్రజలను కదిలించిందని, ఎంతోమంది వీరులను, విప్లవకారులను ఆనాటి స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వాములను చేసిందని,ఆనాటి అమరుల త్యాగ ఫలితమే ఈనాటి స్వాతంత్ర్యమని,కాని ఆ అమరుల కలలు ఈనాటి వరకు నెరవేరలేదని,అధికార మార్పు మాత్రమే జరిగిందని,తెల్లదొరలు పోయి నల్లదొరలు వచ్చారని, ప్రజల బ్రతుకుల్లో అణువు వంతైన మార్పు రాలేదని, పేదరికం,దోపిడి పోలేదని, విద్య,వైద్యం ఉద్యోగం,దున్నేవానికి భూమి,గిట్టుబాటు ధరలు,ఆడపిల్లల జీవితాలకు భద్రత ఇంకెన్నో మరెన్నో సమస్యలు తీరే దారి కనుచూపుమేరలో కానరావడంలేదని,కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి,అవకాశవాద, ప్రజావ్యతిరేక పాలన వల్ల ఈ దేశంలోని బడుగు,బలహీన వర్గాలు రెక్కాడితేనే డొక్కాడే కష్టజీవులు, రైతులు,వ్యవసాయ కూలీలు,అన్ని వర్గాల ప్రజలు ప్రతిరోజు పడరాని పాట్లు పడుతున్నారని,బ్రతుకు బండి లాగలేకపోతున్నారని, అందుకే అమరజీవి భగత్ సింగ్ అందించిన స్ఫూర్తితో యువత నడుము కట్టాలని,పిడికిలెత్తాలని, ఈ దోపిడి పాలనకు చరమగీతం పాడాలని జనతా ప్రజాస్వామిక విప్లవాన్ని సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎ ఐ ఎఫ్ డి డబ్ల్యూ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు వి అనిత, ఏ ఐ ఎఫ్ డి వై నాయకులు, యం డి సుల్తానా బేగం, డి శ్రీనివాసులు, మియాపూర్ డివిజన్ నాయకులు, డి నర్సింహా, యం డి రజియా బేగం, ఎ ఐ ఎఫ్ డి ఎస్ గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ శ్రీకాంత్, విద్యార్థి సంఘం నాయకులు హరి నాద్, శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version