కార్యాలయాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల జాబితాను నోటిసు బోర్డులో ప్రదర్శించాలి

జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 4 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
డిసెంబర్ 5 సాయంత్రంలోగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల జాబితాను జిల్లాలోని అన్ని తాసిల్దార్ మరియు గ్రామపంచాయతీ కార్యాలయాల నోటీస్ బోర్డ్ లో ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తాసిల్దారులను ఆదేశించారు.బుధవారం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులు ఎంపిక మరియు సమగ్ర ఇంటి కుటుంబ సర్వే డేటా ఎంట్రీ ప్రక్రియపై అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ తో కలిసి జిల్లాలోని ఆర్డీవోలు,జిల్లా అధికారులు తాసిల్దారులు,ఎంపీడీవోలు,మున్సిపల్ కమిషనర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని రూరల్ గ్రామాలలో డేటా ఎంట్రీ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే డేటా అండ్ రిపేర్ ప్రక్రియ పూర్తి అయిన మండలాలు ఇంకా పూర్తి కానీ మండలాలకు సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.పాల్వంచలో డేటా ఎంట్రీ పూర్తి అయిన వెంటనే ములకలపల్లి డేటా ఎంట్రీ ప్రక్రియ కు సహాయం అందించాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు.అనంతరం డబల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తులను నిర్దేశిత ఫార్మేట్ ద్వారా పూర్తి చేయాలని, దరఖాస్తు తో పాటు దరఖాస్తుదారులు ఫోటో మరియు ప్రస్తుతం నివాసముంటున్న గృహం యొక్క ఫోటో పొందుపరచాలన్నారు. డిసెంబర్ 5 సాయంత్రంలోగా నిర్దేశిత ఏ బి సి లబ్ధిదారుల జాబితాను జిల్లాలోని అన్ని తాసిల్దార్ మరియు గ్రామపంచాయతీ కార్యాలయాల నోటీస్ కోర్టులో ప్రదర్శించాలని తాసిల్దారులను ఆదేశించారు. ప్రదర్శించిన జాబితాలో అభ్యంతరాలు స్వీకరించటం కోసం గ్రామసభలు నిర్వహించాలని, గ్రామ సభలు వీలైతే గ్రామపంచాయతీ కార్యాలయం పరిధిలో లేదా గ్రామాల్లోని నిరుపేద అవసాల వద్ద నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గ్రామ సభలో ఎక్కడ నిర్వహించేది తాసిల్దార్ మరియు గ్రామపంచాయతీ కార్యాలయాలు నోటీస్ బోర్డ్ లో ప్రజలకు విధంగా ప్రదర్శించాలన్నారు. గ్రామ సభలలో వచ్చిన అభ్యంతరాలపై సత్వరమే విచారణ చేపట్టి తగిన నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.జిల్లాలోఅందుబాటులో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధం చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎటువంటి సమస్యలు తలెత్తిన వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment