వైభవంగా ముస్తాబైన రేణుక ఎల్లమ్మ గుడి..

వైభవంగా ముస్తాబైన రేణుక ఎల్లమ్మ గుడి..

కామారెడ్డి జిల్లా సదాశివ నగర్
పశ్న ఆయుధం అక్టోబర్ 29:

కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల్ భూంపల్లి గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి ప్రారంభానికి సిద్ధంగా ఉంది తెలంగాణలోని ఎక్కడ లేని విధంగా భూంపల్లి గౌడ్ సంఘ సభ్యులు భూంపల్లి గ్రామంలో ఈ గుడిని నిర్మించారు నవంబర్ 9న రేణుక ఎల్లమ్మ గుడి ప్రారంభమవుతుందని గౌడ్ సంఘ సభ్యులు తెలిపారు తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా ఎల్లమ్మ గుడి భూంపల్లిలో నిర్మించారని గ్రామస్తులు పేర్కొన్నారు. గ్రామంలోని అందరూ కలిసిమెలిసిగా ఉంటూ నవంబర్ 9 నుండి 13వ తేదీ వరకు జరిగే ఉత్సవాలలో అమ్మవారికి బోనం తీయడం జరుగుతుంది అంతేకాకుండా రేణుక ఎల్లమ్మ ఒగ్గు కథ ఉంటుంది అంతేకాకుండా ఈ ఏడాది ప్రారంభిస్తున్న ఎల్లమ్మ గుడి ప్రత్యేకత ఉంది గౌడ్ సంఘ సభ్యుల సొంత డబ్బులతో ఈ గుడిని నిర్మించడం జరిగింది ఎన్ని ఆటంకాలు వచ్చిన గుడి నిర్మాణం పూర్తి అవ్వడానికి గౌడ్ సంఘ సభ్యులు ప్రతి ఒక్కరు కృషి చేయడం అభినందనీయం భూంపల్లి గ్రామస్తులు పేర్కొన్నారు. గ్రామంలో గౌడ్ సంఘ సభ్యులు ఒక యూనిట్ తో ఉండి పుట్ట ఎల్లమ్మ మాతమ్మ దేవాలయం నిర్మించడంలో గౌడ్ సంఘ సభ్యులు ఎంతగానో కృషి చేశారు. రేణుక ఎల్లమ్మ గుడి చుట్టూ కంచ ఏర్పాటు చేసి రేణుకా మాత ఎల్లమ్మ గుడి ప్రారంభం కాకముందే పండుగల కు వచ్చి ప్రజలు ఎల్లమ్మ గుడి ఇంత చక్కగా నిర్మించినందుకు గౌడ్ సంఘ సభ్యులకు వివిధ గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఇంత చక్కగా ఎల్లమ్మ గుడిని నిర్మించలేరని ఒక భూంపల్లి గ్రామంలోనే నిర్మించడం అభినందన నియమని గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు గౌడ్ సంఘ సభ్యులను అభినందిస్తున్నారు. ఎన్ని కష్టాలు ఆపదలు వచ్చినా వారి సంకల్పంతో గుడి నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. నవంబర్ 9 శనివారం నుండి నవంబర్ 13 బుధవారం వరకు జరిగే కార్యక్రమాలకు ప్రతి ఒక్కరు రాగలరని భూంపల్లి గౌడ్ సంఘ సభ్యులు కోరుకుంటున్నారు.

Join WhatsApp

Join Now