తమిళనాడులో బయటపడ్డ భారీ కుంభకోణం
తమిళనాడులో భారీ కుంభకోణం బయటపడింది. రాష్ట్రవ్యాప్తంగా 318 మంది నకిలీ స్టాంప్ విక్రయదారులు రూ.951.27 కోట్ల పన్ను ఎగవేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు గుర్తించారు. ఇద్దరు నకిలీ వెండర్లను అధికారులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులైన మెట్రో ఎంటర్ప్రైజెస్ యజమాని జయప్రకాష్, బషీర్ అహ్మద్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.