మూల సూత్రధారి ప్రభాకర్ రావు ఇండియా కు వస్తె కొందరి బ్రతుకు జైలు పాలవడం

IMG 20241110 WA0090

మూల సూత్రధారి ప్రభాకర్ రావు ఇండియా కు వస్తె కొందరి బ్రతుకు జైలు పాలవడం చిప్ప కూడు తినడం తప్పదు.తెలంగాణ,ఆంధ్ర లో ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవం.ప్రభాకర్ రావు ఇండియా కు రానంత వరకు ఫోన్ ట్యాపింగ్ దొంగలు సురక్షితం.అమెరికా చట్టాల ప్రకారం వీసా గడువు దాటితే అక్కడ ఉండటం నేరం.3నెలల వీసా మీద వెళ్లిన ప్రభాకర్ రావు ఇక్కడి నేతల వత్తిడితో మరో 6 నెలలు ఆరోగ్య రీత్యా వీసా గడువు పొడగించుకొన్నాడు.ఇప్పుడు ఆ సమయం కూడా ఐపోవడం తో ఇండియా వస్తాడని తెలిసి గుట్టు చప్పుడు కాకుండా…ఒక BRS ముఖ్య నాయకుడు ప్రభాకర్ రావు కు 10 కొట్లు ఇచ్చి గ్రీన్ కార్డు తీసుకొనేలా పావులు కదిపాడు.అమెరికాలో ఎవరైనా 10 కొట్లు బిజినెస్ కోసం ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకు గ్రీన్ కార్డు ఇచ్చే వెసులుబాటు వాడుకొని ప్రభాకర్ రావు ఇండియా కు రాకుండా ఆపగలిగారు.నిజం గా ప్రభాకర్ రావు దోషి కాకపోతే కోర్టు కు హాజరు అయ్యేవాడు.నిజాలు దర్జాగా చెప్పి మళ్ళీ అమెరికా కు వెళ్ళవచ్చు.కానీ ప్రభాకర్ రావు చేసింది తప్పు నిజం.కెసిఆర్ కోసం అడ్డమైన తప్పులు చేశాడు అతడు చేసిన తప్ప చిన్న తప్పు కాదు.దేశ ద్రోహం నేరం.చేయించినవాడు రాష్ట్రానికి సీఎం…మంత్రులు.తాము తప్పు చేసింది కాక ప్రక్క రాష్ట్రం రహస్య చీకటి మిత్రుడు జగన్ కు టెక్నోలజి ఇచ్చారు దానితో ఇద్దరు ముఖ్యమంత్రులు దోస్త్ మేరా దోస్త్ అంటూ అధికారం గుప్పెట్లో పెట్టుకొని ప్రతిపక్ష నాయకులపై కేసులు , వారికి మద్దతు ఇచ్చేవారి పై కేసులు పెట్టీ పార్టీ లను బలహీనం చేశారు.ఇక భవిషత్ లో వాళ్ళకు తిరుగు లేదు అనుకొన్నారు.కాలం అన్నివేళలా ఒకేలా ఉండదు కదా…పాపం పండింది..అధికారం పోయింది…చేసిన తప్పుడు పనులు సాక్ష్యాలతో బయటకు వచ్చాయి.ఇప్పుడు జైల్లో ముఖ్య పోలీస్ అధికారులు ఊచలు లెక్కపెడుతూ చేసిన తప్పు అన్ని చెప్పేశారు.ముఖ్య సూత్రధారులు ఎవరో తెలిసింది కోర్టు కు సాక్షాలు కావాలి అందుకే ముఖ్య సూత్రధారి ప్రభాకర్ రావు కోసం ఎదురు చూపులు.దేశం లో ఎందరో బిజినెస్ మెన్ లు వేల కోట్లు ఎగకొట్టి దేశం వదిలి పారిపోయిన సంఘటనలు మనం చూశాం.కానీ ఒక పోలీస్ ఉన్నతాధికారి దేశ ద్రోహం చేసి విదేశం లో దాక్కుంటే పిలిపించడానికి కేంద్రం తన అధికారులు సరిగా వాడుకోలేదేమో అని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.కేంద్ర లోని సీబీఐ కు ఉన్న విచక్షణాధికారలు ఉపయోగించి ప్రభాకర్ రావు ను రప్పించలేకపోతే..మన చట్టాలకు విలువ ఉండదు.ఇలాంటి నేరాలకు మరికొందరు ఆఫీసర్లు కూడా చేయడానికి మనమే అవకాశం కల్పించిన వాళ్ళం అవుతే…మన దేశ రక్షణ నిర్వీర్యం అవుతుంది.మేధావులు ఆలోచన చేయండి.ప్రభాకర్ రావు రాకుండా రాయభారం చేసిన వ్యక్తులను గుర్తించండి.వెంటనే ప్రభాకర్ రావు ను రప్పించడానికి ఉన్న అవకాశాలు వెతకండి.ప్రభాకర్ రావు ఆస్తులు సీజ్ చేయండి

Join WhatsApp

Join Now