కన్కల్లో నూతన పాలకవర్గ సమావేశం ఘనంగా
సర్పంచ్ మైలారం రవీందర్ రెడ్డి – ఉపసర్పంచ్ చాకలి మహేందర్‌కు శుభాకాంక్షలు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం డిసెంబర్ 22
కన్కల్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సమావేశం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్‌గా మైలారం రవీందర్ రెడ్డి, ఉపసర్పంచ్‌గా చాకలి మహేందర్ నాయకత్వం వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, తానాజీ రావు, రాష్ట్ర అధ్యక్షులు పుల్గం దామోదర్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ పుల్గం సాయి రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు వెల్మ రవీందర్ రెడ్డి హాజరయ్యారు. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా సమిష్టిగా పనిచేస్తామని నేతలు తెలిపారు. సమావేశంలో గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.