మోడీ – రేవంత్ సర్కార్ బడ్జట్ లో కార్మికులకు మొండి చెయ్యి చూపారు .
నాలుగు లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా కార్మిక లోకం గళంఎత్తాలి.
ప్రభుత్వరంగ సంస్థలను బిజెపి కుట్రల నుండి కాపాడుకుందాం.
8 గంటల పని హక్కు సాధించింది ఏఐటీయూసీనే–ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరాటి ప్రసాద్
ఘనంగా ఏఐటీయూసీ దమ్మపేట మండలం 3వ మహాసభ .
దమ్మపేట :
కార్మిక వర్గ హక్కుల పరిరక్షణ కోసం సంఘటిత అసంఘటిత కార్మిక లోకం పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి
నరాటి ప్రసాద్ పిలుపునిచ్చారు. ఆదివారం జరిగిన ఏఐటీయూసీ 3వ మహాసభ నిర్వహించారు.
మహాసభ లో ముఖ్యఅతిధి గా పాల్గొన్న నరాటి ప్రసాద్ మాట్లాడుతూ మోడీ పాలన అసంఘటిత రంగాన్ని నరకం చూపిస్తుంది అని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరాటి ప్రసాద్ ఆరోపించారు,
దమ్మపేట లో ఆదివారం జరిగిన ఏఐటీయూసీ జిల్లా మహాసభ లో ముఖ్యఅతిధి గా పాల్గొన్న ప్రసాద్ మాట్లాడుతూ అసంఘటితరంగంలో పని చేస్తున్న లక్షలాది మంది కార్మికులు. ఉద్యోగులు తమ విధులు నుండి తొలిగించిన వారి కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితి లోకి నెట్టబడ్డారు అని అన్నారు, భారత్ లో 2015- 16 నుండి 2022-23 ఆర్థిక సంవత్సరాల మధ్య దేశంలో 63 లక్షల అసంఘటితరంగం సంస్థలు మూత పడ్డాయి అని ఫలితంగా 1.6 కోట్ల ఉద్యోగాలు పోయాయి అని అన్నారు,
రెక్కల పై జీవిస్తున్న హమాలీ, బిల్డింగ్ ఆటో, స్కీమ్ వర్కర్స్ (అంగన్వాడీ. ఆశా. ఏ ఎన్ ఎం,’ ఎస్ మిడ్డే మిల్ వివో ఏ లు )కు ప్రభుత్వం నుండి అందాల్సిన బెనిఫిట్స్ అందటం లేదు అని చాలి చాలని వేతనం తో కుటుంబాలు అప్పుల ఊబి లోకి వెళ్తున్నాయి అన్నారు,
ఇటీవల పెట్టిన బడ్జట్ లో దేశం లో మోడీ – రాష్టం లో రేవంత్ ప్రభుత్వాలు కార్మిక వర్గానికి ఎలాంటి ప్రయోజనకరం గా ఒక్కరూపాయి కూడా నిధులు ఇవ్వలేదు అని మనిషి జీవిచాలి అంటే కనీస వేతనం 26 వేలు ప్రతి నెల ఇవ్వాలి అన్న సుప్రీం కోర్టు ఆదేశం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అనే చట్టం అమలు ఎందుకు పాలకులు చేయరు అని ప్రశ్నించారు ,
కొట్లాడి సాధించిన 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోల్డ్ గా మార్చాలని కుట్రను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చేస్తుంది అని, ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మి ఆదా నీ అంబానీలకు అప్పజెప్పేందుకు తీవ్ర కృషి చేస్తుందని విమర్శించారు.
కేంద్రం. రాష్ట్ర ప్రభుత్వం లు ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో కార్మికులు కు నిదులు కేటాంపులు జరుపలేదు అని, సంఘటిత,రంగం లో రాష్టం లో 2 కోట్ల మంది కార్మికులు కు ఎలాంటి ప్రయోజనము లేకుండా చేసారు అని కనీస వేతనం అందటం లేదు అని ఆవేదన ఎక్తం చేశారు.అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న శ్రామిక జీవులకు ఏఐటీయూసీ దిక్చూచి వంటిదని, కార్మికులకు ఏ కష్టం వచ్చినా బాసటగా నిలిచే సంఘం ఏఐటీయూసీ అని, కార్మికులు, ఉద్యోగుల హక్కులు, సౌకర్యాలకు స్వాతంత్రానికి పూర్వం నుంచే పోరాడుతోందని, 8 గంటల పనివిధానం, సంక్షేమ చట్టాలను సాధించి పెటింది ఏఐటీయూసీనేనని అన్నారు. ఎన్నో పోరాటాలు, ప్రాణత్యాగాలతో సాధించుకున్న చట్టాలని ప్రస్తుత మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేసే కుంట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ పరిస్థితిలో ఏఐటీయూసీ నాయకత్వంలో పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.
అనంతరం ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష కంచర్ల జమలయ్య. బి కే ఎం యు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ డి సలీం ,ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వి మల్లికార్జన్ . ఎండీ యూసుఫ్ ,మాట్లాడుతూ* కార్మిక వర్గానికి అనేక హామీలు గుప్పించిన అధికారంలోకి వచ్చినా కేంద్రంలోని బిజెపి సర్కార్ అధికారం చేపట్టిన తరవాత అనేక పోరాటాలుతో సాధించిన కార్మిక చట్టాలను సవరించి యాజమాన్యాలకు, కార్పొరేట్ సంస్థలకు, పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈ కుట్రలను కార్మిక వర్గం ఉద్యమాలతోనే తిప్పికొట్టి సంక్షేమ చట్టాలను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. నేటి పాలకులు కనీస వేతన చట్టం, పారిశ్రామిక చట్టాలను సవరణ చేయడంతోపాటు సంస్కరణలు పేరుతో ఉద్యోగులను, కార్మికులను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారని, ప్రభుత్వాల దుశ్చర్యలను కార్మికువర్గ పోరాటంతో ఎదిరించి హక్కులను కాపాడుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమం లో.ఏఐటియుసి మండల కార్యదర్శి. బెజవాడ రాము.
సిపిఐ మండల కార్యదర్శి సుంకిపాక ధర్మ. మండల సహాయ కార్యదర్శులు. బత్తుల సాయి. యార్లగడ్డ మణికంఠ. శ్రీమన్నారాయణ. లక్ష్మీనారాయణ. బసవయ్య. ప్రభాకర్. చెన్నారావు. ఉదయ్. సహదేవుడు. కోగలంపాటి వెంకటేశ్వరరావు. కోటి. ఎస్ కే జాన్బీ
నక్క నాగమణి. కృష్ణవేణి. విజయలక్ష్మి. గ్రామ దీపికలు. అంగన్వాడి వర్కర్స్. సెకండ్ ఏఎన్ఎంలు. ఆటో కార్మికులు. పెయింటర్స్. తదితరులు పాల్గొన్నారు.