Site icon PRASHNA AYUDHAM

అసెంబ్లీలోబీసీ రిజర్వేషన్ ఆమోదించిన మంత్రి

ధర్మవరం నియోజకవర్గం

అసెంబ్లీలోబీసీ రిజర్వేషన్ ఆమోదించిన మంత్రి

ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, మంత్రి సవితమ్మకు 

కృతజ్ఞతలు తెలిపిన ఎంపీపీ గొడ్డు మర్రి ఆదినారాయణ యాదవ్ 

 అసెంబ్లీ సమావేశాలలో భాగంగా గురువారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించడంతో ముదిగుబ్బ మండల పరిషత్ అధ్యక్షులు గొడ్డు మర్రి ఆదినారాయణ యాదవ్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, బిసి సంక్షేమ మంత్రి సవితమ్మకు, ఎన్డీఏ కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ బీసీ చట్టసభల్లో 33 శాతం బీసీల రిజర్వేషన్ ప్రవేశపెట్టడంతో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, అభినందనలు తెలిపారు.ఎన్ని ప్రభుత్వాలు మారినా బీసీల రిజర్వేషన్ కోసం పోరాడలేదన్నారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో బీసీల రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో ఆమోదించడం, బీసీలకు ఒక వరమన్నారు. అదేవిధంగాధర్మవరంలో మెగా టెక్సటైల్స్ పార్కు ఏర్పాటు కోసం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ 30 కోట్ల నిధులను మంజూర్ కు కృషిచేసిన సత్తన్నకు అభినందనలు తెలియజేయడం జరిగిందన్నారు.బీసీల రిజర్వేషన్ బిల్లు ను అసెంబ్లీలో ఆమోదించడంతో ఎన్డీఏ కూటమి హర్షం వ్యక్తం చేశారు.

 

 

Exit mobile version