*పేద ప్రజలందరికీ ప్రభుత్వం అండగా ఉంటుంది*
*అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తాం*
*నూతన పెన్షన్లు అందించిన ఎమ్మెల్యే
పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి ఏప్రిల్ రెండు ( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తి మహేశ్వరరావు
రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని, పేద ప్రజలందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. గురువారం ఉదయం 1, 3, 27 వార్డులకు చెందిన వితంతువులకు నూతన పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు మేమున్నామన్న భరోసా కల్పిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించడం జరుగుతుందన్నారు. ప్రతినెలా ఒకటో తేదీన పెన్షన్ దారులు నిద్ర లేవక ముందే సచివాలయ సిబ్బంది పెన్షన్ డబ్బులు పట్టుకొని ఇంటి ముందు ఉండడం ఎంత గర్వకారణం అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎవరికైతే పెన్షన్లు రాలేదో వారందరికీ కూటమి ప్రభుత్వం పెన్షన్లు అందించడం జరుగుతుందని అన్నారు. భర్త చనిపోయిన రెండు నెలలకే వితంతు పెన్షన్ అందించే ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు. పార్వతీపురం నియోజవర్గంలో ఎవరైతే తమ భాగస్వాములను కోల్పోయారో వారంతా పెన్షన్కు అర్హులేనని, తక్షణమే దరఖాస్తు చేసుకున్నట్లయితే పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బెలగాం జయప్రకాశ్ నారాయణ (జయబాబు), టిడిపి పట్టణ కార్యదర్శి మజ్జి వెంకటేష్, కౌన్సిల్ సభ్యులు టి.వెంకటరావు, బడే గౌరునాయడు, మంత్రి రవికుమార్, టిడిపి నాయకులు గుంట్రెడ్డి రవికుమార్, డాక్టర్ గరిమెళ్ళ భానుప్రసాద్, కోలామధు, సారిక గణేష్,జొన్నాడ శ్రీదేవి, పాలకొండ రాజశేఖర్, టిడిపి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.