*పౌరుని నైతిక అభివృద్ధి నిజమైన దేశ అభివృద్ధి- బి ఆర్ అంబేద్కర్*
*డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు*
*కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్ది కుమార్*
*ఇల్లందకుంట ఏప్రిల్ 14 ప్రశ్న ఆయుధం*
స్థానిక ఇల్లందకుంట మండల కేంద్రంలో లోని అపర భద్రాద్రి ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి గరుడ చౌరస్తాలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్ది కుమార్ మాట్లాడుతూ,
సమానత్వానికి శిల్పి, రాజ్యాంగానికి నేత బహుజనుల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అని ఆయన ఆలోచనలు ఉద్యమాలు ఇప్పటికీ మార్గదర్శకమే అని జాతికి న్యాయం నేర్పిన మహానేత అని పౌరుని నైతికాభివృద్దే నిజమైన దేశాభివృద్ధి అని చాటిన మహామేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అని అంటరానితనం, అస్పృశ్యత నిర్మూలనకు, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన ధీశాలి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని నేటి తరానికి ఆ మహనీయుని సేవలు స్ఫూర్తిదాయకమని భారత రాజ్యాంగ రూపశిల్పి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఆ మహానుభావుని సేవలు స్మరిస్తూ ఘననివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో గూడపు సారంగపాణి ఉప్పుల శ్రీనివాస్ రెడ్డి పెద్ది శివకుమార్ కనుమల్ల సంపత్ కనుమల్ల రామకృష్ణ ఎక్కటి సంజీవరెడ్డి జిల్లెల సందీప్ రెడ్డి వంగ రామకృష్ణ మేష రాజయ్య బండి మల్లయ్య అన్నారపు సాయి గూడెపు ఓదెలు మనసాని రవి ఆరే రమేష్ రెడ్డి కోడం శ్రీనివాస్ మ్యాడిద తిరుపతిరెడ్డి కురిమిండ్ల చిరంజీవి రేణి కుంట్ల రవీందర్ నరేష్ భోగం చిరంజీవి గంధం రవీందర్ పసునూటి అన్వేష్ తదితరులు పాల్గొన్నారు