వికారాబాద్ జిల్లా నవల్గాకు చెందిన నరేష్ (17), ఓ బాలిక (16) ప్రేమించుకుని మే 2న ఇంట్లో నుంచి పారిపోయారు. దాంతో అతనిపై జహీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్ కేసు నమోదైంది. అయితే బాలుడి ఆచూకీ చెప్పాలంటూ గత మూడు నెలలుగా పోలీసులు చిత్ర హింసలు పెడుతున్నారని నరేష్ తల్లి కళావతి వాపోయారు. పోలీసుల దెబ్బలకు చేతులు, కాళ్లు వాచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కొట్టిన విషయం తమ దృష్టికి రాలేదని, దీనిపై విచారణ జరుపుతామని సీఐ అశోక్ తెలిపారు.