నూతన బోరు మోటర్ ప్రారంభించిన మున్సిపల్ ఛైర్ పర్సన్

నూతన బోరు మోటర్ ప్రారంభించిన మున్సిపల్ ఛైర్ పర్సన్

ప్రశ్న ఆయుధం, డిసెంబర్ 18, కామారెడ్డి :

కామారెడ్డి పట్టణంలోని 41వ వార్డులో నీటి సమస్యను నివారించడానికి మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి బోర్ వేయించారు. అనంతరం చైర్ పర్సన్ మాట్లాడుతూ.. నీటిని సంరక్షించాలని ,చెట్లు నాటడం పర్యావరణాన్ని రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. సీజనల్ వ్యాధులు వ్యాపిస్తుందున ప్రతి ఒక్కరు ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రతను పాటించాలని పరిసరాలు నీటిగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలోని పట్టణ కౌన్సిలర్లు పాత శివ కృష్ణమూర్తి, పంపరి లతా శ్రీనివాస్, పిడుగు మమత సాయిబాబా, వనిత రామ్మోహన్, జిల్లా సెక్రటరీ పంపరి లక్ష్మణ్, నాయకులు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now