Site icon PRASHNA AYUDHAM

2కే రన్ ను ప్రారంభించిన మున్సిపల్ ఛైర్ పర్సన్

జెండా ఊపి 2కే రన్ ను ప్రారంభించిన మున్సిపల్ ఛైర్ పర్సన్

ప్రశ్న ఆయుధం న్యూస్, డిసెంబర్ 02, కామారెడ్డి :

కామారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తాలో ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా జిల్లా పురపాలక సంఘం ఆధ్వర్యంలో 2 కె రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి జండా ఊపి టు కే రన్ ను ప్రారంభించారు.
ప్రభుత్వం ఏర్పాటయి ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నందున ఏడాది పూర్తయిన సందర్భంగా విజయోత్సవంలో భాగంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ టూకే రన్ కార్యక్రమం నిజాంసాగర్ చౌరస్తా నుండి కళాభారతి ఆడిటోరియం వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంచార్జ్ కమిషనర్ శ్రీహరి, టి.పి.ఓ గిరిధర్, శానిటరీ ఎస్సై పర్వేజ్, జవాన్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version