*మున్సిపాలిటీలో విలీన ప్రాంతాలను అభివృద్ధికి మున్సిపాలిటీ సిద్ధం*
*మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్*
*జమ్మికుంట జూన్ 11 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక నిర్వహిస్తున్న క్రమంలో కొత్తగా విలీనమైన ధర్మారం, రామన్నపల్లి, కొత్తపల్లి ప్రాంతాలతో పాటు అయ్యప్ప టెంపుల్ ఏరియా, జర్నలిస్టుల కాలనీ, మారుతీనగర్ ఏరియా ప్రాంతాలలో డ్రైనేజ్, పారిశుధ్య పనులను సర్వే చేయించి, ఆ చోట్ల అవసరమయ్యే రోడ్లు, డ్రైనేజ్ ఎస్టిమేట్ వేయించి సీడీఏంఏ దృష్టిలో పెట్టి నిధుల మంజూరు అయిన వెంటనే పనులు చేపించి పట్టణ అభివృద్ధికి పాటుపడుతామని మున్సిపల్ కమిషనర్ ఎండి ఆయాజ్ తెలిపారు. మారుతీనగర్ సమీపంలో రోడ్లపై బుషులు, ముళ్ళ కంపల వల్ల డ్రైనేజ్ వాటర్ పోకుండా అడ్డుపడుతున్నాయని, బుధవారం రోజున జేసీబీ సహాయంతో వాటిని తీసివేసి నీరు సాఫీగా వెళ్ళే విధంగా చేసినట్లు ఆయన తెలిపారు. ఆస్తి పన్నులో, 5శాతం రిబేట్ లో మొదటి స్థానంలో నిలిచిన జమ్మికుంట పట్టణ ప్రజలకు , వార్డులలో మౌలిక సదుపాయాలు సమకూర్చే విధంగా చూస్తామని కమిషనర్ మహమ్మద్ అయాజ్ తెలిపారు ఈ కార్యక్రమంలో మేనేజర్ జి రాజిరెడ్డి, ఏఈలు నరేష్, వికాస్, శానిటరీ ఇనస్పెక్టర్ మహేష్, సదానందం లతో పాటు తదితరులు పాల్గొన్నారు.