*ఘనంగా పాలకవర్గ ఆత్మీయ వీడ్కోలు అభినందన సభ*
*జమ్మికుంట జనవరి 24 ప్రశ్న ఆయుధం*
జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికైన మున్సిపల్ పాలకవర్గ పదవీకాలం ముగుస్తున్నందున వారికి మున్సిపల్ ఛైర్మెన్ తక్కల్లపల్లి రాజేశ్వర్ రావు, కమిషనర్ మొహమ్మద్ అయాజ్ ల అధ్యక్షతన పాలకవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు. శుక్రవారం జమ్మికుంట మున్సిపాలిటీ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా పాలకవర్గ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రవేశపెట్టిన డంపింగ్ యార్డ్ ప్రహరీ గోడ నిర్మాణానికి 5లక్షలు, పోస్ట్ ఆఫీస్ పక్కనగల వాటర్ ట్యాంక్ ప్రహరీ గోడ, గేట్ కు 2లక్షలు, 2025-26 వార్షిక సంవత్సర ఉద్యోగుల జీతభత్యాలను రెన్వియల్ వంటి 12 అంశాలను పాలకవర్గ సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తక్ల్లపల్లి రాజేశ్వర్ రావ, కమిషనర్ మహమ్మద్ అయాజ్ లు మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధికి ఎంతగానో పాలకవర్గ సభ్యులు కృషి చేశారని, పది సంవత్సరాల్లో అభివృద్ధి కానీ మున్సిపాలిటైని ఈ పాలకవర్గ హయంలో అభివృద్ధి జరిగిందని వారు తెలిపారు. ఈ పాలకవర్గ అభివృద్ధిలో ఇప్పటికీ ఎప్పటికీ తోడు ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం మున్సిపల్ ఛైర్మెన్. రాజేశ్వర్ రావు, వైస్ చైర్మన్ దేశిని స్వప్న, పాలకవర్గ సభ్యులను శాలువాలతో, మెమొంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో మున్సిపల్ మేనేజర్ జి రాజిరెడ్డి, సిబ్బంది పలువురు పాల్గొన్నారు.