సంగారెడ్డి, సెప్టెంబరు 21 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి పట్టణ పరిధిలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి సందర్భంగా రజక సంఘం జిల్లా అధ్యక్షుడు నామ నగేష్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. శనివారం సంగారెడ్డిలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి రజక సంఘం జిల్లా అధ్యక్షుడు నామ నగేష్ ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.
కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులర్పించిన నామ నగేష్
Published On: September 21, 2024 3:37 pm