చార్మినార్ జోన్ లో కలపాలని ఎమ్మెల్యేకు వినతి

మెదక్/నర్సాపూర్, మార్చి 26 (ప్రశ్న ఆయుధం న్యూస్): నర్సాపూర్ రెవెన్యూ డివిజన్‌ను చార్మినార్ జోన్ (జోన్-6), మల్టీజోన్-2లో విలీనం చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డికి యువకులు వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డిని మాదాపూర్‌లోని నివాసంలో కలిసి పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్‌లో తమ అవకాశాలను ప్రభావితం చేసే సమస్యపై చర్చించారు. ఈ సందర్భంగా పలువురు యువకులు ప్రస్తుతం నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ రాజన్న సిరిసిల్ల జోన్ (జోన్-3)లో భాగంగా ఉండటంతో ప్రజా ఉద్యోగాల్లో తక్కువ అవకాశాలు లభించడం, అన్యాయ పరిస్థితులు నెలకొంటాయని అన్నారు. రాజన్న సిరిసిల్ల జోన్‌లో భాగంగా ఉండటం వల్ల నర్సాపూర్ ప్రాంతానికి అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని, ముఖ్యంగా ప్రజా ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అదనంగా నర్సాపూర్ రెవెన్యూ డివిజన్‌ను చార్మినార్ జోన్ (జోన్-6)లో విలీనం చేయడం ద్వారా మాత్రమే యువత భవిష్యత్తు అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి సానుకూలంగా స్పందించి, ఈ విలీన ప్రక్రియ కోసం అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని సీఎం కార్యాలయానికి తీసుకెళ్లి ప్రతిపాదించనున్నట్లు ఆమె యువతకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ యువత చౌటి నవీన్, నవదీప్, అజయ్, ఉదయ్ కిరణ్, ఉదయ్, దీపక్, సుజిత్ తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now