ప్రతి ఒక్కరి ఇంటిపై జాతీయ జండా ఎగరాలి*

*స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరి ఇంటిపై జాతీయ జండా ఎగరాలి*

*జాతీయ భావం పెంచేందుకే ఇలాంటి కార్యక్రమాలు*

*కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి*

*ప్రతి కార్యకర్త ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలి*

*బిజేపి జిల్లా అధ్యక్షురాలు అరుణా తార*
ప్రశ్న ఆయుధం న్యూస్, ఆగస్టు 09, కామారెడ్డి :

భారత ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు, బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమ సన్నాహక సమావేశం బీజేపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ .. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరి ఇంటిపై జాతీయ జండా ఎగరాలనీ అన్నారు. స్వతంత్ర దినోత్సవం రోజు ప్రతి ఒక్కరూ జండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. బిజేపి కార్యకర్తలు ఇంటింటికీ జండా ఉండేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. జాతీయ భావం పెంచేందుకే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుందని పేర్కొన్నారు.
బిజేపి జిల్లా అధ్యక్షురాలు అరుణా తారా మాట్లాడుతూ హర్ ఘర్ తీరంగా కార్యక్రమంలో భాగంగా 11 తేది నుండి 14 తేది వరకు బీజేపీ ఆద్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. బీజేవైఎం ఆధ్వర్యంలో బైక్ ర్యాలి నిర్వహించి మండల, గ్రామ, బూత్ స్థాయిలో కార్యకర్తలు, ప్రజలను పెద్ద సంఖ్యలో  ఈ కార్యక్రమాల్లో పాల్గొనేల చూసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now