బిజినపల్లి తాండా యువకుడి జాతీయ స్థాయి దూకుడు

బిజినపల్లి తాండా యువకుడి జాతీయ స్థాయి దూకుడు

జాతీయ వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌కు తెలంగాణ జట్టు ఎంపిక

గ్వాలియర్‌లో సెప్టెంబర్ 5 నుంచి 10 వరకు పోటీలు

IMG 20250903 WA0052 scaledనాగర్‌కర్నూల్ బిజినపల్లి తాండా ప్రతిభావంతుడు ఆంగోతు పాండు జట్టులో చోటు

రాష్ట్రం నుంచి ఎంపికైన 12 మందిలో మన ప్రాంతపు క్రీడాకారుడికి అవకాశం

పాండు విజయంపై సర్వోదయ నిర్వాహకుల గర్వభావం

ప్రశ్న ఆయుధం హైదరాబాద్, సెప్టెంబర్ 3 (ప్రతినిధి):

మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ వేదికగా సెప్టెంబర్ 5 నుంచి 10 వరకు జరగనున్న తొమ్మిదవ జాతీయ వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్కు తెలంగాణ జట్టు సిద్ధమైంది. కెప్టెన్ కోటేశ్వర్ సారథ్యంలో రాష్ట్రం నుండి ఎంపికైన 12 మంది క్రీడాకారుల జాబితాలో నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి తాండాకు చెందిన ఆంగోతు పాండు చోటు సంపాదించుకోవడం స్థానికులకు గర్వకారణంగా మారింది.

సర్వోదయ వికలాంగుల ఆవాస విద్యా నిలయం వ్యవస్థాపకులు జీ.వి. సుబ్బారావు మాట్లాడుతూ, “మన ప్రాంత యువకుడు జాతీయస్థాయిలో తెలంగాణ తరఫున ఆడటం గర్వకారణం” అన్నారు. సర్వోదయ పూర్వ విద్యార్థి పాండు ప్రతిభతో రాష్ట్రానికి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. నిర్వాహకులు జీ. మురళీధర్ రావు, జీ. రామచందర్ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ, పాండు ప్రతిభతో భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో నిలుస్తాడనే నమ్మకం వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment