నేషనల్ మెడికల్ కమిషన్ స్కాం కేసులో కీలక పరిణామం

నేషనల్ మెడికల్ కమిషన్ స్కాం కేసులో కీలక పరిణామం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) స్కాం కేసులో సీబీఐ దర్యాప్తు వేగం పెంచింది.వరంగల్‌లోని కొలంబో మెడికల్ కాలేజీ చైర్మన్ కొమ్మారెడ్డిపై సీబీఐ కేసు నమోదు చేసింది. మెడికల్ కాలేజీ అప్రూవల్స్ కోసం ఆయన రూ.66 లక్షల లంచం చెల్లించినట్లు ఆధారాలు లభించినట్లు సమాచారం.అంతేకాదు, తెలుగు రాష్ట్రాల్లోని రెండు మెడికల్ కాలేజీల్లో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. విశాఖపట్నంలోని గాయత్రి మెడికల్ కాలేజీ డైరెక్టర్ వెంకట్, కొలంబో మెడికల్ కాలేజీ చైర్మన్ కొమ్మారెడ్డి పై కూడా సీబీఐ కేసులు నమోదు చేసింది.

ఈ కేసులో దేశవ్యాప్తంగా 36 మంది పై కేసులు నమోదయ్యాయి. నిందితుల్లో కేంద్ర ఆరోగ్యశాఖకు చెందిన ఆరుగురు అధికారులు కూడా ఉన్నారని సీబీఐ వెల్లడించింది.ప్రస్తుతం సీబీఐ అన్ని సంబంధిత ఆధారాలను సేకరించి దర్యాప్తును కొనసాగిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment