జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం 

జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం

*ఏర్పాట్లు సర్వం సిద్ధం డిప్యూటీ డిఎంహెచ్వో చందు*

*జమ్మికుంట ఆగస్టు 7 ప్రశ్న ఆయుధం*

గురువారం ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో సోమవారం రోజున జరిగే జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం(NATIONAL DEWORMING DAY) కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హుజురాబాద్ డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ చందు తెలియజేస్తూ జమ్మికుంట మండల పరిషత్ లో మండల స్థాయి అధికారులకు ఎన్ డి డి మీద కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించి ఎన్ డి డి కార్యక్రమం విజయవంతం కావడం కోసం సలహాలు సూచనలు మండల స్థాయి అధికారులకు తెలిపారు మున్సిపల్ పరిధి మండల పరిధిలోని ప్రాథమిక పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ జూనియర్ కళాశాల లోని ఒకటి నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయుటకు ఏర్పాటు చేయడం జరిగిందని, 11వ తేదీ నాడు ఆల్బెండజోల్ మాత్రలు వేసుకొని పిల్లలకు 18వ తేదీ నాడు వేయడం జరుగుతుందని,సోమవారం (11వ తేదీ ఆగస్టు) రోజు జరగబోయే జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం విజయవంతం చేయుటకు ప్రజాప్రతినిధులు,అధికారులు, పత్రికా ప్రతినిధులు సహకరించగలరని కార్యక్రమాన్ని విజయవంతం తెలిపారు ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ ఎంపీడీవో హేమలత ఎంఈఓ డాక్టర్ చందన, మోహన్ రెడ్డి హెల్త్ ఎడ్యుకేటర్, రమాదేవి అంగన్వాడి సూపర్వైజర్, మహేష్ మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్, నరేందర్ హెల్త్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment