రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితోనే జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు..
నిజామాబాద్ జనవరి 16
రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితోనే జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు” నిజామాబాద్ జిల్లా లో రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితోనే జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు సాధ్యమైందని,ఇందులో నిజమాబాద్ ఎంపీ అర్వింద్ కృషి ఏమీ లేదని రూరల్ ఎమ్మెల్యే.డాక్టర్.ఆర్.భూపతిరెడ్డి స్పష్టం చేశారు.జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు.వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల అనేక సార్లు పసుపు బోర్డు విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాడన్నారు.ప్రధాని మోడీకి,కేంద్ర మంత్రులకు లేఖ ద్వారా విన్నవించారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే కనీసం తమకు సమాచారం ఇవ్వడం లేదన్నారు. కనీసం పసుపు రైతులకు కూడా సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు.స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా ఆగమేఘాలపై వర్చువల్ గా ప్రారంభించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇందులో ఎంపీ అర్వింద్ కృషి ఏమీ లేదన్నారు.2019లో ఎన్నికలకు ముందు తనను గెలిపిస్తే ఐదు రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని బాండ్ పేపర్ రాసిచ్చారని గుర్తుచేశారు.కానీ ఐదేళ్లు పట్టిందన్నారు.రైతులు పసుపు బోర్డు అడిగితే మధ్యలో స్పైసిస్ బోర్డు రీజినల్ కార్యాలయాన్ని నిజామాబాద్ లో ఏర్పాటు చేశారన్నారు.రైతులు దీనిపై ఎంపీని ప్రశ్నిస్తే పసుపు బోర్డు కంటే స్పైసిస్ బోర్డు చాలా పెద్దదని,రైతులు ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుందని మభ్యపెట్టారన్నారు.స్పైసిస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి మూడేళ్లయినా ఎటువంటి పురోగతి లేదని పేర్కొన్నారు. కేవలం కార్యాలయం ముందు బోర్డు పెట్టి చేతులు దులుపుకున్నారన్నారు. ప్రస్తుతం తమ ఒత్తిడితోనే కేంద్రం ముందుకు వచ్చి నేషనల్ టర్మరిక్ బోర్డును ఏర్పాటు చేసిందని చెప్పారు. ప్రధానంగా రైతులను భాగస్వాములను చేసి బోర్డు నడిపించాలని పేర్కొన్నారు. సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్.ముప్ప. గంగారెడ్డి,ఐసీడీఎంఎస్ ఛైర్మన్ తారా చంద్, నాయకులు.శేఖర్ గౌడ్,బాగారెడ్డి,మునిపల్లి సాయరెడ్డి.పాల్గొన్నారు.