*“అధికారుల నిర్లక్ష్యం… కదిలిన రైతాంగం”*
ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 10 (ప్రశ్న ఆయుధం):
తిమ్మాపూర్ గ్రామంలో గత వారం కురిసిన భారీ వర్షాల కారణంగా చెరువు కట్ట పంట కాలువలు మరియు ముత్తడి కొట్టుకు పోవటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో, పంటలు ఎండిపోతాయేమోనని రైతాంగం ఆందోళనలో ఉంది.
ప్రస్తుత పంటకాలంలో వరి, మక్క పంటలు కీలక దశలో ఉండగా, నీటి సరఫరా నిలిచిపోవడం రైతులకు పెద్ద సమస్యగా మారింది. పరిస్థితిని తట్టుకోలేక, రైతులే స్వయంగా చెరువు కట్టను పూడ్చే పనులు, కాలువ మరమ్మత్తులు తమ శక్తి మేరకు చేపట్టారు.
> “మా పంటలు వాడిపోకుండా తక్షణమే నీటి సరఫరా పునరుద్ధరించాలని అధికారులను వేడుకుంటున్నాం. మేం మా కష్టాన్ని కాపాడుకోవడానికే ఇంత కష్టపడుతున్నాం,” అని సదరు రైతులు ఆవేదన వ్యక్తం చేశాడు.
రైతులు జిల్లా అధికారులు, నీటి పారుదల శాఖ తక్షణం స్పందించి, చెరువు కట్ట పునరుద్ధరణ, కాలువ మరమ్మత్తులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోకపోతే వందల ఎకరాల పంటలు నష్టపోయే తమ జీవనోపాధిని కోల్పోయొ ప్రమాదం ఉందని రైతులు హెచ్చరిస్తున్నారు.