ఘనంగా నిర్వహించిన  “ఎన్విఆర్ బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ ఫెస్ట్”

ఘనంగా నిర్వహించిన

“ఎన్విఆర్ బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ ఫెస్ట్”

IMG 20250810 WA0018 ప్రశ్న ఆయుధం ఆగస్టు 10: కూకట్‌పల్లి ప్రతినిధి

79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా కూకట్‌పల్లి జయానగర్‌ ఎ ఎమ్ వై స్పోర్ట్స్ అరేనాలో “ఎన్విఆర్ బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ ఫెస్ట్”ను వివేకానంద నగర్ 122 డివిజన్‌ బీజేపీ అధ్యక్షులు డా. ఎన్. వంశి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌లో స్థానిక యువతతో పాటు పలువురు క్రీడాభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర్‌రావు హాజరై టోర్నమెంట్‌ను ప్రారంభించి ఆటగాళ్లను ఉత్సాహపరిచారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రీడల ద్వారా స్నేహభావం, ఐక్యత పెంపొందించడమే కాకుండా శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం కూడా లభిస్తుందని తెలిపారు.గెలుపోటములు సహజం అని వాటిని వ్యక్తిగతంగా తీసుకోవద్దని గెలిచిన వారినీ అభినందించాలి,ఓడిన వారిని గౌరవించాలని తెలిపారు, యువత క్రీడలలో చురుకుగా పాల్గొని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు దేశానికి గౌరవం తీసుకురావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భాస్కర్ గౌడ్, గోపాల్ రావు,వేణు, రేపన్ రాజు,కృష్ణ , తదితరులు క్రీడాభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment