*పంట యోగ్యం కాని భూములను పరిశీలించిన రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు*
*జమ్మికుంట జనవరి 16 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని సైదాబాద్, విలాసాగర్ గ్రామాల పరిధిలో గల పంట పండించుటకు యోగ్యం కానీ భూములను గురువారం రోజున వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారుల సమన్వయంతో క్షేత్ర స్థాయిలో పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మండలంలోని గ్రామాలలో గురువారం నుండి పంట సాగు కు యోగ్యం కాని భూములను సర్వే చేసి గుర్తించడం జరుతున్నదని మండల వ్యవసాయ అధికారి ఎండి ఖాదర్ హుస్సేన్ అన్నారు. క్షేత్ర పరిశీలనలో గుర్తించిన సాగుకు యోగ్యంకాని భూములను 21 వ తేదీ నుండి జరుగు గ్రామ సభలలో ప్రదర్శించి తీర్మానించడం జరుగుతoదని తెలిపారు మడిపల్లి బిజిగిరి షరీఫ్ తనుగుల వావిలాల గ్రామాలలో శుక్రవారం క్షేత్ర పరిశీలన జరుగుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎండి ఖాదర్ హుస్సేన్ ఆర్ ఐ లు ఎండి నదీమ్,గడ్డం శంకర్, ఏఈఓ లు అచ్యుత్, రాజేష్ రైతులు తదితరులు పాల్గొన్నారు.