అర్టిజన్ కృష్ణ మృతికి కారణమైన అధికారులను సస్పెండ్ చేయాలి
యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ ( సిఐటియు ) రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ గుంటిపల్లి సధాకర్
గజ్వేల్ డిసెంబర్ 3 ప్రశ్న ఆయుధం :
విద్యుత్ శాఖ ట్రాన్స్కో 132 కేవి నర్సంపేటలో గత 12 రోజుల క్రితం ఆర్టిజన్ గ్రేడ్ వన్ కృష్ణ తొ పెయింటింగ్ వర్క్స్ చేపిస్తుండగా విద్యుత్ ప్రమాదం జరిగింది. మృత్యువుతో 12 రోజులు పోరాడి తుది శ్వాస విడిచాడు అసలు కాంట్రాక్టర్స్ చేయవలసిన పనులు వారితో చేయించకుండా ఆర్టిజన్లతో చేయించడం వల్ల ఈ ప్రమాదం జరిగింది సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా అధికారుల నిర్లక్ష్యం తోటి జరిగిన ప్రమాదం కాబట్టి ఈ ప్రమాదానికి కారణం అయినా అధికారులు వెంటనే సస్పెండ్ చేసి కృష్ణ కుటుంబానికి న్యాయం చేయగలరని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ట్రాన్స్కో లో జరుగుతున్న పరిణామాల పైన క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి కార్మికులకు న్యాయం చేయాలి అని ఆయన కోరారు.