*పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి* *రైల్వే స్టేషన్ ముందు రైల్వే కార్మికుల ఆందోళన*
*జమ్మికుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 12*
ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్, సౌత్ సెంట్రల్ మజ్దూర్ యూనియన్ పిలుపుమేరకు సోమవారం జమ్మికుంట రైల్వే బ్రాంచ్ ఆధ్వర్యంలో జమ్మికుంట రైల్వే స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు వారి యొక్క ప్రధాన డిమాండ్ పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోవిడ్ కాలంలో ఇవ్వాల్సిన పద్దెనిమిది నెలల డిఏ బకాయిలు చెల్లించాలని వెంటనే ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు చేయాలని మజ్దూర్ యూనియన్ కార్మికుల ఆందోళన చేపట్టారు నాయకులు జమ్మికుంట బ్రాంచ్ చైర్మన్ వి. రాజయ్య వైస్ చైర్మన్ జి, స్వప్న బ్రాంచ్ యూత్ కన్వీనర్ పి కుమార్ స్వామి లతోపాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు