పాత టెండర్ విధానాన్ని అలాగే కొనసాగించాలి   

పాత టెండర్ విధానాన్ని అలాగే కొనసాగించాలి

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

( ప్రశ్న ఆయుధం) ఆగస్టు 11

 

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర జిల్లా వ్యాప్తంగా గురుకుల పాఠశాలలకు కూరగాయలు పండ్లు ఆహార పదార్థాల ముడి సరుకులు అందజేసే కాంట్రాక్టర్లు గురుకుల పాఠశాలలో పాత టెండర్ విధానాన్ని అమలు పరచాలని లేనియెడల 13వ తారీకు నుండి పాఠశాలలకు అందజేయాల్సిన ముడి సరుకులు నిలిపివేస్తామని వినతి పత్రం అందజేశారు. గత నాలుగు నెలల నుండి వారికి ఎటువంటి బిల్లులు రావడం లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నామని కొత్త టెండర్ విధానంలో చాలా కఠిన నియమ నిబంధనలు చాలా ఉన్నాయని వాటిని అనుకరించే ఆర్థిక స్తోమత వారికి లేదని పాత టెండర్ విధానాన్ని అవలంబించి తమకు న్యాయం చేయాలని కోరుకున్నారు.

Join WhatsApp

Join Now