అతి పురాతనమైన హనుమాన్ దేవాలయం  మరమ్మత్తులు

అతి పురాతనమైన హనుమాన్ దేవాలయం

మరమ్మత్తులు

ప్రశ్న ఆయుధం మే22: కూకట్‌పల్లి ప్రతినిధి

IMG 20250522 WA2271

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బాలానగర్ లోని అతి పురాతనమైన హనుమాన్ దేవాలయం శిథిలావస్థకు చేరడంతో సొంత నిధులతో గుడి మరమ్మత్తులు మరియు ప్రహరీ గోడ నిర్మాణం ధ్వజస్తంభం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అలాగే ఫిరోజ్ గూడ లోని ముఖద్వారం కొరకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆవులు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ అత్యంత పురాతనమైన హనుమాన్ దేవాలయం ఈ విధంగా శిథిలావస్థకు చేరడంతో భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు దేవాలయం మరమ్మత్తులు చేసి ధ్వజస్తంభం ఏర్పాటు చేస్తున్నామని ,అలాగే ప్రహరీ గోడ నిర్మాణం కూడా పూర్తి చేస్తామని, తాను ఎమ్మెల్యే అయిన తర్వాత సొంత నిధులతో మరియు గ్రామస్తులు సహకారంతో అతి పురాతనమైన కూకట్పల్లి రామాలయం పునర్నిర్మించుకు న్నామనీ ,అలాగే నియోజకవర్గంలోని పురాతన దేవాలయాలకు తన వంతు సహాయం చేస్తూ భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నా నని ఆనందం వ్యక్తం చేశారు .అంతేకాకుండా ఒక ఊరిలో దేవాలయం బాగుంటే ఆ ఊరి ప్రజల సుభిక్షంగా ఉంటారని ,అందుకనే నిత్య పూజలతో దేవాలయాలు కళకళలాడితే సిరిసంపదలతో, సుఖ సౌఖ్యాలతో గ్రామాలు కలకలాడుతాయని అన్నారు.. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now