Site icon PRASHNA AYUDHAM

సిగాచి పరిశ్రమలో కొనసాగుతున్న రిస్క్యూ సహాయక చర్యలు: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

IMG 20250703 221835

Oplus_0

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 3 (ప్రశ్న ఆయుధం న్యూస్):ఇస్నాపూర్ మండలం పాశమైలారం సిగాచి పరిశ్రమలో రెస్క్యూ ఆపరేషన్ సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రావిణ్య తెలిపారు. సిగాచి ఫార్మా పరిశ్రమ ప్రమాద తాజా పరిస్థితులను కలెక్టర్ ప్రావిణ్య వివరించారు. పరిశ్రమలో మొత్తం 143 మంది కార్మికులు పని చేస్తుండగా.. 61 మంది కార్మికులు సురక్షితంగా ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇంకా ఆసుపత్రిలో 23 మంది గాయాలైన కార్మికులకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఆస్పత్రిలో కోలుకున్న12 మంది కార్మికులను డిశ్చార్జి చేసి ఇంటికి పంపించినట్లు తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన 31 మంది కార్మికుల గుర్తింపు ప్రక్రియ పూర్తయినట్లు తెలిపారు. ఇంకా 7 మంది కార్మికుల మృతదేహాలు గుర్తించాల్సి ఉందన్నారు. మృతదేహాలు గుర్తించిన 31 మంది కార్మికుల కుటుంబాలకు రూ.లక్ష తక్షణ ఆర్థిక సాయం అందజేసినట్లు, 34 మంది క్షతగాత్రులకు రూ. 50వేల రూపాయలు తక్షణ సహాయం చేసినట్లు తెలిపారు. ఇంకా ఆచూకీ తెలియని 9 మంది కార్మికుల కుటుంబాలకు రూ.10వేల తాత్కాలిక సహాయం అందజేసినట్లు కలెక్టర్ తెలిపారు. 29 మంది కార్మికుల కుటుంబాల రక్త పరీక్షలు ప్రయోగశాలలో పరిశీలిస్తున్నట్లు తెలిపారు. 18 మంది రక్త నమూనాలు మృతుల రక్తనమోనులతో సరిపోయినట్లు తెలిపారు. ఇప్పటివరకు 37 మంది కార్మికులకు పోస్టుమార్టం పనులు పూర్తయినట్లు తెలిపారు.

Exit mobile version