జర్నలిస్టులందరికి ఇళ్ళ స్ధలాలు దక్కడమే ఏకైక లక్ష్యం
జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల సహకారంతో ముందుకేళ్తాం
వారం రోజుల వ్యవధిలో సభ్యత్వాల జారీ పక్రియను పూర్తి చేయాలి
ఏకతాటిపైకి వచ్చిన మూడు జర్నలిస్టు యూనియన్ల సంయుక్త ప్రకటన
ఖమ్మం నియోజకవర్గంలో అర్హులైన జర్నలిస్టులందరికి వీలైనంత తొందరగా ఇళ్ళ స్ధలాలు దక్కడమే ఏకైక లక్ష్యమని ,ఈ లక్ష్యసాధన కోసం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల సహకారంతో ముందుకు సాగాలని మంగళవారం ఖమ్మం నగరంలో జరిగిన మూడు వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ల సంయుక్త సమావేశం ఏకగ్రీవంగా తీర్మాణించింది.ఇప్పటికే ఇళ్ళ స్ధలాల పక్రియ అలస్యం అయ్యిందని ,దీపావళీ అనంతరం ఈ పక్రియ మరింత వేగిరపర్చేందుకు మూడు యూనియన్లు స్ధంభాద్రి జర్నలిస్ట్ హౌజింగ్ సోసైటికి సంపూర్ణ సహకారం అందించాలని నిర్ణయం తీసుకుంది.పదవులు ముఖ్యం కాదు జర్నలిస్టులకు ఇళ్ళ స్ధలాలు దక్కడమే తక్షణ కర్తవ్యంగా ముందుకు సాగాలని సమావేశం అభిప్రాయపడింది.ఖమ్మం నగరంలో టి ఎన్ జివో కార్యాలయంలో జరిగిన ఉమ్మడి సమావేశానికి ప్రభుత్వం గుర్తింపు పొందిన మూడు జర్నలిస్టు యూనియన్ ప్రతినిధులు హాజరయ్యారు.సుధీర్ఘ చర్చల అనంతరం అర్హులైన జర్నలిస్టులందరికి సత్వరమే ఇళ్ళ స్ధలాలు దక్కేందుకు హౌజింగ్ సోసైటితో కలిసి కార్యచరణలోకి దిగాలని సమావేశం అభిప్రాయపడింది.ఇందుకుగాను జిల్లాకు చెందిన డిప్యూటి ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క్ తోపాటు రాష్ట్ర రెవెన్యూ,సమాచార,పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావులను, జిల్లా కలెక్టర్ ను , సంబంధిత అధికారులను మూడు జర్నలిస్ట్ సంఘాల కు చెందిన 9మంది మంది స్టిరింగ్ కమిటి సభ్యులు ,హౌజింగ్ సోసైటి బాధ్యులు ఉమ్మడిగా కలిసి జర్జలిస్టులందరికి సత్వరమే ఇళ్ళ స్ధలాలు అందేవిధంగా విన్నతిపత్రాన్ని అందజేసి వారి సంపూర్ణ సహకారాన్ని కోరాలని తీర్మాణించాయి.అక్రిడేషన్ కలిగిఉండి సొసైటి నిర్ణయించిన కాలపరిమితి ఉన్నవారికే హౌజింగ్ సోసైటిలో సభ్యత్వాల రశీదులు ఇవ్వాలని నిర్ణయించాయి.రానున్న వారం రోజుల వ్యవధిలోనే సభ్యత్వాల రశీదుల జారీ పక్రియను పూర్తి చేయాలని మూడు యూనియన్ల ప్రతినిధులు అభిప్రయపడ్డారు. ఇందుకుగాను నవంబర్ 2న మూడు జర్నలిస్ట్ యూనియన్లకు చెందిన సమన్వయ కమిటి సభ్యులు సొసైటి డైరెక్టర్లతో సమావేశం కావాలని నిర్ణయించాయి.మూడు యూనియన్లతో ఏర్పాటైన సమన్వయ కమిటి సలహాలు,సూచనలను సొసైటి గౌరవించాలని కూడా తీర్మాణం చేయడం జరిగింది.ఈ సమావేశంలో టియుడబ్ల్యుజె (ఐజెయు) తరుపున ఆ యూనియన్ జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు,రాష్ట్ర కమిటి సభ్యులు మాటేటి వేణుగోపాల్, రాష్ట్ర ఎలక్రానిక్ మీడియా అసోసియేషన్ నాయకులు నర్వనేని వెంకట్రావ్,టియుడబ్ల్యజె(టిజెఎఫ్) నుంచి జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ,కార్యదర్శి చిర్రా రవి, జిల్లా నాయకులు బి.ఉదయ్ కుమార్ ,టియుజెఎఫ్ (ఎఫ్) నుంచి జిల్లా అధ్యక్షులు పల్లా కొండల్ రావు,జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా నాయకులు గరిడేపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Post Views: 5