Site icon PRASHNA AYUDHAM

అంబేద్కర్ యూనివర్సిటీ అందించిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి..

IMG 20241113 WA0016

అంబేద్కర్ యూనివర్సిటీ అందించిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి
ప్రశ్న ఆయుధం నవంబర్ 13:

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్ అనే టువంటి నినాదంతోని గత 40 సంవత్సరాల నుంచి లక్షలాది మంది విద్యార్థులకు విద్యనందిస్తుంది అంబేద్కర్ యూనివర్సిటీలో చదివినటువంటి చాలామంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లభించాయని అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ కామారెడ్డి స్టడీ సెంటర్లో పత్రిక విలేకరులతో మాట్లాడుతూ. ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్
డాక్టర్ లక్ష్మణ్, కామారెడ్డి స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ డా. ఏ సుధాకర్ విలేకరులతో విషయాన్ని చెప్పారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నాణ్యమైనటువంటి విద్యను తో పాటుగా నైపుణ్యతతో అందిస్తుంది ప్రామాణికమైనటువంటి గ్రంథాలను కూడా ఆ విద్యార్థులకు అతి తక్కువ ఖర్చుతోనే విద్యను అందిస్తుంది. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి చదువుకునే ఆసక్తి నటువంటి మహిళలు కావచ్చు చిరు ఉద్యోగులు కావచ్చు ఈ అంబేద్కర్ యూనివర్సిటీ అందించిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలియజేస్తున్నాం 2024-25 విద్యా సంవత్సరానికి అంబేద్కర్ యూనివర్సిటీ అడ్మిషన్లు చివరి తేదీ నవంబర్ 15వ తేదీ అని వివరించడం జరిగింది. రెగ్యులర్ యూనివర్సిటీలతో పాటుగా ధీటుగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యను అందిస్తుంది చాలా తక్కువ ఫీజు తోని నాణ్యమైన విద్యను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అందిస్తుంది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చదివినటువంటి విద్యార్థులు సివిల్ సర్వీసు నుంచి అన్ని రకాలైనటువంటి ఉద్యోగ పరీక్షలు రాసుకునే అవకాశం ఉంది దీంట్లో ఎలాంటి అనుమానం లేకుండా మీరు అంబేద్కర్లో చేరేటువంటి అవకాశం ఉంది అడ్మిషన్లు నంబర్ 15 చివరి తేదీ వివరాల కోసం www.braouonline.in వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసి సంబంధిత స్టడీ సెంటర్ లో సంప్రదించండి. ఈ సమావేశంలో జాట్ బాపురావు రమేష్ కౌన్సిలర్ పాల్గొన్నారు. వివరాల కొరకు 7382929695 సంప్రదించ గలరు.

Exit mobile version