మార్కెట్లోకి వచ్చిన ఓరల్ కలరా వ్యాక్సిన్..
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ ‘హిల్కాల్’ పేరుతో ఓరల్ కలరా వ్యాక్సిన్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. గత ఏడాది మార్చి నుంచి ప్రపంచ వ్యాప్తంగా 8,24,479 కలరా కేసులు నమోదయ్యాయి. 5,900 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 31 దేశాల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యం లో వ్యాక్సిన్ కొరతకు చెక్ పెట్టేందుకు ఓరల్ వ్యాక్సిన్ను భారత్ బయోటెక్ విడుదల చేసింది.