*సనాతన ధర్మం , సత్సంగం , భక్తి మార్గం*
సమాజానికి దేశానికి ఎంతో మేలు చేస్తున్నారు . ఇలా జిల్లాలో ఉన్న అన్ని భజన బృందాల్ని ఏకం చేసి వారికి మన సనాతన ధర్మం గురించి పూజా విధానం గురించి నామం , మంత్రం లో ఉన్న నిగూఢమైన అర్ధాన్ని భావాన్ని తెలియచేసి భజన చేసేటప్పుడు నామం జపించేటప్పుడు ఆ భావంతో చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఇస్తాయి , కావున సక్రమమైన విధానం ద్వారా ప్రతి హిందువుని జాగృతం చేసేందుకు విశ్వహిందూ పరిషత్ ఈ కార్యక్రమాన్ని శ్రీ రాజరాజేశ్వరి ఆలయం రోటరి నగర్ , ఖమ్మం నందు నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లాలో అన్ని మండలాలు గ్రామాల లో ఉన్న పలు భజన బృందాలు జిల్లా లో వున్న అన్ని గ్రామాల నుండి వెయ్యి మంది పైన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు . విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు , తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు , ఇస్కాన్ భక్తులు హిందూ ధర్మ ప్రచారకులు , రాష్ట్ర సత్సంగ్ అధ్యక్షులు పండరినాథ్ , జిల్లా అధ్యక్షులు బోనాల రామకృష్ణ , కార్యదర్శి బొడ్డు కృష్ణ , జిల్లా సంఘటనా కార్యదర్శి చలమల వేంకటేశ్వర్లు , కోశాధికారి పసుమర్తి రవి , ఉపాధ్యక్షుడు నేరెళ్ల శ్రీనివాస్ , మహిళా అధ్యక్షురాలు కనగంటి నాగమణి , కట్టా వైదేహి , కృష్ణప్రియ , నగర కమిటీ శ్రీనివాసు , రాణి , రాజు, రవి , రాము , లక్ష్మీనారాయణ , భానుమతి , శశాంక్ తిరుమల తిరుపతి ధర్మ ప్రచారకులు వేంకట రాణా ప్రతాప్ , వనం తేజశ్రీ లు పాల్గొన్నారు .