*భార్య గొడవతో పురుగుల మందు తాగి ఇంటికి నిప్పు*
*ఇల్లందకుంట జనవరి 21 ప్రశ్న ఆయుధం*
పురుగుల మందు తాగిన ఓవ్యక్తి ఇంటికి నిప్పు పెట్టిన ఘటన మండలం లోని మల్యాల లో చోటుచేసుకుంది. స్థానికులు కథనం ప్రకారం గ్రామానికి చెందిన చందగల్ల సాంబయ్య (65) అనే వ్యక్తి మంగళవారం తెల్లవారుజామున పురుగుల మందు సేవించి ఇంటికి నిప్పు పెట్టాడు గమనించిన స్థానిక ప్రజలు 100 కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని స్పృహ తప్పి పడిపోయిన ఉన్న బాధితుడిని పోలీస్ వాహనంలో హుజురాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా డాక్టర్ల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు బాధితుడి భార్య ఇటీవలనే గొడవపడి హైదరాబాదులోని తన బిడ్డకు వద్దకు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు