Site icon PRASHNA AYUDHAM

పార్టీ బలోపేతమే లక్ష్యం – గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

IMG 20251014 223612

పార్టీ బలోపేతమే లక్ష్యం – గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం నాయకులు అంకితభావంతో పని చేయాలంటూ పిలుపు

డిసిసి కొత్త అధ్యక్షుల ఎంపికపై పరిశీలకుల సమావేశం భైంసాలో నిర్వహణ

ఏఐసీసీ, టిపిసిసి పరిశీలకులు పాల్గొన్న సమీక్షా సమావేశం

స్థానిక నాయకత్వానికి ప్రాధాన్యం పెంచనున్నట్లు టిపిసిసి జనరల్ సెక్రటరీ స్పష్టం

మీడియా సమావేశంలో పలువురు ప్రముఖ నాయకులు హాజరు

ప్రశ్న ఆయుధం అక్టోబర్ 14భైంసా : తెలంగాణ కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి వరకు బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు.

నిర్మల్ జిల్లా భైంసాలో నిర్వహించిన “సంఘటన్ శ్రీజన్ అభియాన్” సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హైకమాండ్ ఆదేశాల మేరకు కొత్త జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతోందని తెలిపారు. పార్టీ పునర్వ్యవస్థీకరణ ద్వారా కేడర్‌లో ఉత్సాహం నింపి, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయపథంలో నడవడం లక్ష్యమని చెప్పారు.

ఈ సమావేశానికి ఏఐసీసీ పరిశీలకుడు అజయ్ సింగ్, పిసిసి పరిశీలకుడు మిద్దెల జితేందర్, మాజీ మంత్రి గడ్డం ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు పటేల్, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి, ఎమ్మెల్యే రేఖ శ్యామ్ నాయక్, గ్రంథాలయ చైర్మన్ అర్జుమాంద్ అలీ, మాజీ జడ్పీ చైర్మన్ ధన్వాన్తరీ, జిల్లా కోఆర్డినేటర్ రాంభూపాల్, లకవత్ దాణపతి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కూచూరి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

భైంసా రోడ్డులోని గౌరీ శంకర్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో మీడియాతో మాట్లాడిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, “పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలి. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయికి కాంగ్రెస్ శక్తిని మరోసారి చాటుకోవాల్సిన సమయం ఇది” అన్నారు.

Exit mobile version