ఉపాధ్యాయుల పెండింగ్ డి ఏ లను విడుదల చేసి, పి ఆర్ సి ని వెంటనే ప్రకటించాలి!!

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ టి పి టి ఎఫ్ సభ్యత్వ నమోదు లో భాగంగా ఈ రోజు శివ్వంపేట మండలంలోని పలు పాఠశాలలను సందర్శిస్తూ, సమస్యలను సేకరించారు. అనంతరం జిల్లా కార్యదర్శులు ఎస్,సాయిబాబా
ఎస్ ఆర్, సురేష్ రెడ్డి , కె,సుదర్శన్ మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్ లో ఉన్న డి ఏ లను విడుదల చేస్తూ, పిఆర్సీని వెంటనే ప్రకటించాలని
రాష్ట్రంలోని ప్రతి ప్రాథమిక పాఠశాలకు, తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్ని ప్రాథమిక పాఠశాలలకు పి.ఎస్.హెచ్.ఎం. పోస్టులను మంజూరు చేసి, డీఈడీతో పాటు బీఈడీ అర్హత కలిగిన ఎస్జీటీ ఉపాధ్యాయులకు కూడా పదోన్నతులు కల్పించాలని కోరారు. ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లో ఉన్న అన్ని బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.సిపిఎస్ విధానం రద్దు చేసి వెంటనే ఓ పి ఎస్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కేజీబీవీ మరియు యూఆర్ఎస్ ఉపాధ్యాయులు మరియు సిబ్బందికి కనీస మూలవేతనం చెల్లించాలని, మహిళా ఉపాధ్యాయుల మాదిరిగా 27 సెలవులు మంజూరు చేయాలని , సమగ్ర శిక్షా అభియాన్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను అందరిని రెగ్యులర్ చేసి అందరికీ మినిమం టైం స్కేల్స్ ను వర్తింపచేయాలని మరియు,317 జీవో ద్వారా మ్యూచ్ వల్ బదిలీ చేయబడిన ఉపాధ్యాయులకు బదిలీలు చేపట్టాలన్నారు. 317 జీవోలో స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులకు మరియు పెండింగ్ లో ఉన్న 13 జిల్లాల స్పౌజ్ కేటగిరి ఉపాధ్యాయులకు వెంటనే న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల బాధ్యులు ఎస్,నారాయణ్ గౌడ్
వరగంటీ సంతోష్ కుమార్ మరియు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now