వార్డ్ కౌన్సిలర్ను సన్మానించిన 47వ వార్డు ప్రజలు 

వార్డ్ కౌన్సిలర్ను సన్మానించిన 47వ వార్డు ప్రజలు

ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 47వ వార్డు కౌన్సిలర్ గెరిగంటి స్వప్న లక్ష్మినారాయణ గడిచిన గత 5 సంవత్సరాలుగా వార్డు ప్రజలకు 24 గంటలు నిరంతరాయంగా అందుబాటులో ఉంటూ సేవలు అందించిరాణి ఆదివారం భారత్ రోడ్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శాలువా, మెమోంటో లతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ ఇలాగే మునుమందు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తీరుస్తూ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు. ఈ సన్మాన కార్యక్రమంలో భారత్ రోడ్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సిద్దంశేట్టి రమణ గుప్తా, ప్రధాన కార్యదర్శి తాటిపల్లి సునీల్ ( కుబ్బి ) గుప్తా, కోశాధికారి కోడిశాల గంగాధర్ గుప్తా కార్యవర్గ సభ్యులు తాటిపల్లి రమేష్ గుప్తా, కోడిశాల ప్రభాకర్ గుప్తా, కోడిప్యాక బాలాజీ గుప్తా, ముప్పిడి ప్రశాంత్ గుప్తా, తృప్తి అనీల్ గుప్తా లతోపాటు సంఘం సభ్యుల కుటుంబ సభ్యులందరూ పాల్గొని సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Join WhatsApp

Join Now