*అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య*
ప్రశ్న ఆయుధం న్యూస్ 20 ఫిబ్రవరి గాంధారి,
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుర్జాల్ గ్రామానికి చెందిన సోప్పరి మాణిక్యం వయసు 40 సంవత్సరాలు తనకున్న వ్యవసాయ పొలంలో రెండు బోర్లు వేయగా పడకపోవడంతో, అలాగే దుబాయ్ కి వెళ్లి వచ్చినా గాని అతను చేసిన అప్పులు తీరకపోవడంతో, చేసినా అప్పులు ఎలా తీర్చాలని మనోవేదన గురి అయ్యి నిన్న ఉదయం 10 గంటలకు తన వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందు తాగి, తూలుతూ వస్తుండగా అది గమనించిన అతను కొడుకులైన సంగమేశ్వర్ మరియు సందీప్ లు మాణిక్యం నీ కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి కి, తీసుకువెళ్లగా అక్కడి నుండి సికింద్రాబాద్లోని గాంధీ హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందు నిన్న రాత్రి 10 గంటలకు
చనిపోయినాడు. భార్య సొప్పరి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనైనదితెలిపారు