వ్యక్తి అదృశ్యం
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
కామారెడ్డి పట్టణానికి చెందిన వ్యక్తి అదృశ్యమైనట్లు కుటుంబీకులు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పట్టణ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
కామారెడ్డి పట్టణం ఆజాంపుర కాలనీకి చెందిన మహమ్మద్ యాసిన్ ఖాన్ ( 65 ) దేశాయి బీడీ కంపెనీలో పనిచేసేవాడని, ఆ వ్యక్తి శనివారం తేదీ 7-6-2025 నాటి ఉదయం 9:30 గంటల సమయంలో ఇంట్లో నుండి బయటకు వెళ్లి వస్తానని తన స్కూటీ పై బయటకు వెళ్లి, రాత్రి అయినా ఇంటికి రాకపోయేసరికి, ఆదివారం ఉదయం అతని స్కూటీ కామారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద పార్కింగ్ చేసినది గమనించి, చుట్టుపక్కల వెతకగా అతని ఆచూకీ లభించనందున, పోలీస్ స్టేషన్కు వచ్చి మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందనీ పట్టణ పోలీసులు తెలిపారు.
ఇతను బ్లూ కలర్ కుర్తా, తెలుపు రంగు పైజామా, తలపై టోపీ ధరించి ఉన్నాడు. ఇతని ఆచూకీ తెలిసిన ఎవరైనా కూడా కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ కామారెడ్డి టౌన్ 8712686145
8712666242 నెంబర్లకు ఫోన్ చేసి తెలపాలనీ ప్రకటనలో పేర్కొన్నారు