వ్యక్తి అనుమానాస్పద మృతి..!

వ్యక్తి అనుమానాస్పద మృతి..!

– భార్య, మామలపై అనుమానం

– అదుపులోకి తీసుకున్న పోలీసులు

– మల్కాపూర్ గ్రామంలో ఘటన

తాండూరు రూరల్, వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

ఈ సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన ప్రాథమిక సమాచారం మేరకు గ్రామానికి చెందిన రెడ్డిపల్లి వెంకట్ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కాగా భార్య జయశ్రీ, ఆమె తండ్రి కలిసి వెంకట్‌ను హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

విషయం తెలుసుకున్న పోలీసులు భార్య, తండ్రిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న రూరల్ సీఐ నగేష్‌, కరణ్‌ కోట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యప్తు ప్రారంభించారు. అయితే వ్యక్తి హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. గ్రామంలో ఈ సంఘటన కలకలం రేపింది.

Join WhatsApp

Join Now

Leave a Comment