ఫోన్ పోగొట్టుకున్న వారికి ఫోన్ అప్పగింత
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి, మాచారెడ్డి
మాచారెడ్డి పోలీస్ స్టేషన్ లో బుధవారం ఎస్సై అనిల్ కుమార్ ఫోన్ పోగొట్టుకున్న బాధితుడికి ఫోన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సి ఈఐఆర్ యాప్ ద్వారా ఫిర్యాదుదారుడు అయినా పల్వాంచ మండలం భవాని పేట గ్రామానికి చెందిన మంద నారాయణ అనే వ్యక్తి ఫోన్ను అతనికి అప్పగించడం జరిగిందన్నారు.