అనాధలకు సేవ చేయడమే పిఎంకె ఫౌండేషన్ లక్ష్యం

*అనాధలకు సేవ చేయడమే పిఎంకె ఫౌండేషన్ లక్ష్యం*

*పిఎంకె ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పల్లె ప్రభాకర్ గౌడ్*

*జమ్మికుంట జులై 3 ప్రశ్న ఆయుధం*

అనాధలకు అభాగ్యులకు పేద పిల్లలకు సేవ చేయాలని లక్ష్యం సంకల్పంతోనే పిఎంకె ఫౌండేషన్ స్థాపించామని పిఎంకె ఫౌండేషన్ వ్యవస్థాపకులు పల్లె ప్రభాకర్ గౌడ్ తెలిపారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు పిఎంకె ఫౌండేషన్ వ్యవస్థాపకులు పల్లె ప్రభాకర్ గౌడ్ ఆదేశాల మేరకు పిఎంకె ఫౌండేషన్ ఆధ్వర్యంలో పుస్తకాలను పంపిణీ చేశారు. పిఎంకె ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేకమైన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆపదలో ఉన్నవారికి అండగా మేమున్నామని అభయహస్తం అందిస్తుందని పిఎంకె ఫౌండేషన్ నిర్వాహకులు పేర్కొన్నారు గతంలో పాఠశాలలో ఇదే తరహాలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించడం జరిగిందని పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన చిన్నారులకు చేయూతనందిస్తున్న పీఎంకే ఫౌండేషన్ నిర్వాహకులను ప్రధానోపాధ్యాయులు దెబ్బట రవీందర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బలరాం నాయక్ ఫౌండేషన్ నిర్వాహకులు పల్లె రవి గౌడ్, రంజిత్ కుమార్ గౌడ్ ,విద్యా కమిటీ చైర్మన్ గుండ్ల రాజు, బండారి శ్రీనివాస్ యాదవ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now