చీరాల సయ్యద్ అమీన్ ఆరీఫ్ తండ్రి ఖాదర్ అహ్మద్,హత్య జరిగిన 6రోజుల్లో నిందితులను పట్టుకునే విధంగా గట్టి ఒత్తిడి పోలీసులపై తెచ్చిన న్యాయ, మైనారిటీ శాఖ మంత్రి వర్యులు ఫరూక్రా పగలు కష్టపడి హంతకులను పట్టుకున్న పోలీసు శాఖ కి ముఖ్యంగా ఎస్పీ కి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు. అలాగే మంత్రి ఇచ్చిన మాట ప్రకారం మృతుడి కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సంచలనం కలిగించిన యువకుని హత్య కేసును చేదించిన చీరాల 2 టౌన్ పోలీసులు.
బాపట్ల జిల్లా చీరాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదినారాయణపురంలో జరిగిన యువకుని హత్య కేసులో 6 గురు ముద్దాయిలు అరెస్ట్
కేసు చేదనలో విశిష్ట కృషి చేసిన పోలీస్ అధికారులను, సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి ఐపీఎస్..
చీరాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు వివరాలను వెల్లడించిన జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీ టి.పి.విఠలేశ్వర్
నేరం జరిగిన సమయం ఆగష్టు 6 న రాత్రి సుమారు 9.45 గంటల సమయములో
నేరం జరిగిన ప్రదేశం ఆదినారాయణపురం గ్రామం, చీరాల మండలం.
హతుడు:* సయ్యద్ అమీన్ ఆరిఫ్ S/o ఖాదర్ అహ్మద్, కులం-ముస్లిం, వయసు 18 సంవత్సరాలు, ఈసూబ్ నగర్ , ఈపూరుపాలెం, చీరాల మండలం.
ఫిర్యాది: కొండూరి సత్య మనోజ్ S/o యెహోషువ, వయస్సు 18 సం.లు, మాల కులం, శాంతినగర్ , చీరాల మండలం, బాపట్ల జిల్లా.
*ముద్దాయిల వివరాలు:*
1. మల్లె సందీప్ ప్రసన్న కుమార్ @ సందీప్ S/O ఉదయ్ భాస్కర్, వయస్సు 39 సంవత్సరాలు, కులం-ఎరుకుల, శిఖరం వారి వీధి, బాపట్ల (మండలం & జిల్లా).
(వెదుళ్లపల్లి పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ వున్నది)
2. గరిక మహేంద్ర S/O శంకర్ రావు, వయస్సు 39 సంవత్సరాలు , కులం-ఎరుకుల, పాపరాజు తోట, చీరాల మండలం.
(అరెస్టు చేయవలసి ఉన్నది)
3. షేక్ జిలాని @ జిల్లు @ జిల్లు భాయ్ S/O కరిముల్లా, వయసు 27సంవత్సరాలు, ముస్లిం, కొత్తపేట, బాపట్ల (మండలం & జిల్లా.)
(బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో రౌడీ షీట్ వున్నది)
4. షేక్ మహమ్మద్ రియాజ్ S/O నాయబ్ రసూల్, వయసు 22 సంవత్సరాలు, ముస్లిం, అంబేద్కర్ మార్క్, పోలీస్ క్వాటర్స్ వద్ద , బాపట్ల (మండలం & జిల్లా.)
5. పాశం లక్ష్మీనారాయణ @ లక్ష్మణ్ S/O అంకయ్య, వయసు 51 సంవత్సరాలు, కచేరిమిట్ట, కావలి , ప్రస్తుతం కందుకూరు.
6. దేవరకొండ శ్రీనివాసరావు @ శ్రీను S/O లక్ష్మయ్య, వయసు 46 సంవత్సరాలు, కులం ఏరుకుల, స్టూవర్టుపురం గ్రామం, బాపట్ల మండలం.
7. అంగడి సుకుమార్ S/O ప్రభాకర్ రావు, వయసు 24 సంవత్సరాలు ,కులం-ఎరుకుల, రామ్ నగర్, న్యుకాలని, చీరాల మండలం.
(పాత నేరస్తుడు)
8. కర్రేద్దుల వంశీ S/O రాంబాబు, వయసు 26 సంవత్సరాలు, కులం-ఎరుకుల, రామకృష్ణాపురం, చీరాల మండలం.
(అరెస్టు చేయవలసి ఉన్నది)
*కేసు యొక్క పూర్వాపరాలు:*
ది:06.08.2024 న ఈపూరుపాలెం గ్రామలోని ఈసూబ్ నగర్ కు చెందిన సయ్యద్ అమీన్ ఆరిఫ్ (18 సం.) అను యువకుడు హత్యకు గురి కావడం జరిగింది. హతుడి స్నేహితుడు కొండూరి సత్య మనొజ్ ఫిర్యాదు మేరకు చీరాల 2 టౌన్ పోలీసు స్టేషన్ నందు క్రైమ్ నెంబర్ 173/2024 U/S 103 (1),115 (2) r/w 3(5) BNS గా కేసు నమోదు చేయడం జరిగింది.బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ యువకుడి హత్య గురించి తెలుసుకున్న వెంటనే స్వయంగా నేర స్థలమును సందర్శించి, క్షుణ్ణంగా పరిశీలించారు. హత్య కేసును త్వరితగతిన ఛేదించుటకు అడిషనల్ ఎస్పీ టి.పి.విఠలేశ్వర్ ఆద్వర్యంలో, చీరాల డిఎస్పీ జగదీష్ నాయక్, 6 గురు సిఐ లు, 8 మంది ఎస్.ఐ లు, 70 మంది పోలీస్ సిబ్బందితో 7 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినారు.ఎస్పీ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ ఆద్వర్యంలో, చీరాల డిఎస్పీ పర్యవేక్షణలో హత్య కేసు దర్యాప్తు సాగించిన చీరాల టూ టౌన్ సిఐ జి.సోమశేఖర్ ప్రత్యక్ష సాక్షులు, హతుడి కుటుంబ సభ్యులు, ఇతర సాక్షులు చెప్పిన సమాచారం ఆధారంగా, నేర స్థలమును పరిశీలించి, భౌతిక సాక్ష్యాధారాలను పరిగణలోకి తీసుకొని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరానికి పాల్పడిన మొత్తం 8 మంది ముద్దాయిలలో 6 గురిని ఆగష్టు 12న సోమవారం సాయంత్రం 06.0 అరెస్టు చేసినారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితులని త్వరలో పట్టుకుంటామని, వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు.
నేరం జరిగిన తీరు..
హతుడు, ఫిర్యాది ఇద్దరు స్నేహితులు. ది:06.08.2024 వ తేదీన రాత్రి సుమారు 9.45 గంటలకు, హతుడు సయ్యద్ అమీన్ ఆరిఫ్ (18 సం.లు) సైకిల్ మీద, తన స్నేహితుడు/ఫిర్యాది కొండూరి సత్య మనోజ్ మోటార్ సైకిల్ మీద ఆదినారాయణపురం మీదగా వెళుతున్నారు. వారి వెనకనే ముద్దాయిలు AP 07 DD 9603 నెంబరు గల కారులో వచ్చి ఇద్దరిని అవహేళన చేసినారు. గొడవ పెట్టుకుని కొట్టి, కారులో ఉన్న కత్తి తీసుకొని హతుడిని విచక్షణ రహితంగా పొడిచి హత్య చేసినారు. అనంతరం ముద్దాయిలు అదే కారులో పారిపోయినారు.
అరెస్ట్ వివరాలు:
బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఏర్పడిన ప్రత్యేక బృందాలు తమదైన శైలిలో దర్యాప్తు జరిపి, సరైన నిఘా వ్యవస్థ ద్వారా రాబడిన సమాచారం మేరకు.., ఆగష్టు 12 న సోమవారం రాత్రి 11.00 గంటలకు, మధ్యవర్తుల సమక్షంలో ఆరుగురు నిందితులను చీరాల – ఓడరేవు రోడ్డులో బుర్లవారిపాలెం పోవు రోడ్డు వద్ద వున్నా ప్లాట్ల దగ్గర చీరాల టూ టౌన్ సిఐ సోమశేఖర్ వారి సిబ్బందితో అరెస్టు చేసినారు. హత్యకు ఉపయోగించిన కత్తిని, స్వాధీనం చేసుకోవడం జరిగింది. కేసు దర్యాప్తు వేగవంతంగా నిర్వహించి భౌతిక సాక్ష్యాధారాలను, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సేకరించిన ఆధారాలు ఒకదానికొకటి క్రోడీకరించుకొని సంబందిత న్యాయస్థానంలో ముద్దాయిపై చార్జి షీట్ దాఖలా చేసి న్యాయస్థానంలో ముద్దాయిలకు కఠిన మైన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా అడిషనల్ ఎస్పీ టి.పి.విఠలేశ్వర్ తెలిపారు.అభినందన కేసు ఛేదనలో విశిష్ట కృషి చేసిన అడిషనల్ ఎస్పీ టి.పి.విఠలేశ్వర్ , చీరాల డిఎస్పీ జగదీష్ నాయక్, చీరాల II టౌన్, చీరాల I టౌన్, చీరాల రురల్, ఇంకొల్లు, అద్దంకి రూరల్, బాపట్ల టౌన్ ఇన్స్పెక్టర్ లను, 8 మంది ఏస్.ఐ లను, స్పెషల్ టీమ్ లను, CCS సిబ్బందిని, జిల్లా ఐటి కోర్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించినారు.