– దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి ని చాకచక్యంగా వ్యవహరించి, అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు.
అనంతరం జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్ మీడియాతో మాట్లాడుతూ.. పాలకుర్తి మండల కేంద్రంలోని చార గొండ్ల మల్లయ్య కాలనీలో బోడ లలిత ఇంటిలో ఈనెల 18 తారీకు రాత్రి జరిగిన దొంగతనంలో వావిలాల గ్రామానికి చెందిన కరణం సాయికుమార్ ను సీసీ కెమెరాలో దొరికిన ఆధారాలు ఆధారంగా నిందితుని అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. అతని వద్ద నుంచి 13 తులాల బంగారం 40, తులాల వెండి, సుమారుగా వీటి విలువ నాలుగు లక్షల ఆరువేల రూపాయలు నిందితుని నుంచి రికవరీ చేసి రిమాండ్ చేసి కోర్టు కు తరలించామని తెలిపారు. ACP వర్ధన్నపేట ఆధ్వర్యంలో స్పెషల్ టీం ఏర్పాటు చేసి ముద్దాయిని పట్టుకున్నందుకు పాలకుర్తి సిఐ గట్ల మహేందర్ రెడ్డి, ఎస్సై దూలం పవన్ కుమార్, పోలీస్ సిబ్బందిని, DCP రాజమహేంద్ర నాయక్ అభినందించారు.